Childhood Pic: హీరో చేతిలో హీరో.. టాలీవుడ్‌లో టాప్ ఫ్యామిలీ వారసులు.. ఎవరో తెలుసా..
Childhood Pic: సెలబ్రెటీలకు చెందిన ఏ చిన్న విషయమైనా అభిమానులకు ఆసక్తి. ఇక వారి చిన్నతనాన్నికి సంబందించిన ఫోటోలు, అలవాట్లు అయితే మరింత ఇంట్రెస్టింగ్. తెలుగు చలన చిత్ర పరిశ్రమ..

Childhood Pic: సెలబ్రెటీలకు చెందిన ఏ చిన్న విషయమైనా అభిమానులకు ఆసక్తి. ఇక వారి చిన్నతనాన్నికి సంబందించిన ఫోటోలు, అలవాట్లు అయితే మరింత ఇంట్రెస్టింగ్. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అక్కినేని ఫ్యామిలీ((Akkineni Family)కి ఒక స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కినేని నాగేశ్వర రావు నట వారసులుగా తనయుడు నాగార్జున, మనవడు సుమంత్, సుశాంత్, సుప్రియలు వెండి తెరపై అడుగు పెట్టారు. అయితే నాగార్జున తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇక మనవడు సుమంత్ తన నటనతో తాతకు తగ్గవాడు అనిపించుకున్నాడు. తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ ఫొటోలో సుమంత్గా ప్రసిద్ధిచెందిన సుమంత్ కుమార్ ను అక్కినేని నాగార్జున ఎత్తుకుని ఉన్న ఫోటో.
సుమంత్ అక్కినేని పెద్దకూతురు సత్యవతి, అల్లుడు యార్లగడ్డ సురేంద్ర దంపతుల కుమారుడు. అయితే సుమంత్ ను ఎన్నార్ దత్తత తీసుకున్నారు. దీంతో సుమంత్ అక్కినేని అయ్యాడు. తాతగారి దగ్గరే పెరిగాడు. నాగార్జున తన మేనల్లుడిని ఎత్తుకుని ఉన్న ఫోటో ఇది.

Nagarjuna Sumanth
సుమంత్ అమెరికా వెళ్ళి మిచిగన్ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ కోర్సులో చేరాడు. ఇంజనీరింగ్ చదువు నచ్చక పోవడంతో చికాగో లో కొలంబియా కాలేజీ లో ఫిల్మ్ కోర్సులో చేరి డిగ్రీ పూర్తి చేశాడు. నాగార్జున తర్వాత అక్కినేని నట వారసుడిగా సుమంత్ 1999లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ప్రేమ కథ చిత్రంతో టాలీవుడ్ లో హీరోగా అడుగు పెట్టాడు. ఎన్నార్ తో కలిసి పెళ్లి సంబంధం, మేనమామ నాగార్జున తో కలిసి స్నేహం అంటే ఇదేరా సినిమాల్లో కలిసి నటించాడు. సుమంత్ తాజాగా మళ్ళీ మొదలైంది సినిమాలో నటించాడు.
Also Read:




