Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss OTT: బిగ్‏బాస్ ఓటీటీ కంటెంస్టెంట్స్ వీళ్లే.. నెట్టింట్లో పైనల్ లిస్ట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‏బాస్ (Bigg Boss )..అన్ని భాషల్లో ఈ షోకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో ఆదరణ లభిస్తోంది. అటు హిందీలో 15 సీజన్లు..

Bigg Boss OTT: బిగ్‏బాస్ ఓటీటీ కంటెంస్టెంట్స్ వీళ్లే.. నెట్టింట్లో పైనల్ లిస్ట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Bigg Boss Telugu Ott
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 17, 2022 | 7:06 AM

బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‏బాస్ (Bigg Boss )..అన్ని భాషల్లో ఈ షోకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో ఆదరణ లభిస్తోంది. అటు హిందీలో 15 సీజన్లు.. తెలుగులో 5 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ షో ఓటీటీ వేదికపై ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రేక్షకులకు ఈసారి 24 గంటల ఎంటర్‏టైన్‏మెంట్ అందించేందుకు తెలుగు బిగ్‏బాస్ ఓటీటీని తీసుకురాబోతున్నట్లుగా గతంలోనే నిర్వాహకులు ప్రకటించారు. బిగ్‏బాస్ ఓటీటీ తెలుగు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 26 నుంచి ఈ షో స్ట్రీమింగ్ కానుంది. బిగ్‏బాస్ ఓటీటీకి నాగార్జున హోస్టింగ్ చేయనున్నారు.

బిగ్‏బాస్ ఓటీటీలో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరనేది తెలుసుకోవడానిని నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురి పేర్లు బయటకు వచ్చాయి. ఇందులో మాజీ బిగ్‏బాస్ కంటెస్టెంట్స్ మాత్రమే కాకుండా.. కొత్త వారు.. యూట్యూబర్స్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్ వినిపించింది. తాజాగా బిగ్‏బాస్ ఓటీటీ ఫైనల్ కంటెస్టెంట్స్ ఫిక్స్ అయ్యారు. అందులో పాల్గొనబోయేది వీళ్లే అంటూ నెట్టింట్లో టాక్. అందులో సీజన్ 1 నుంచి సీజన్ 5 వరకు కనీసం ఇద్దరేసి కంటెస్టెంట్లను తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వీరితోపాటు సోషల్ మీడియా స్టార్స్, యూట్యూబర్స్ ఇలా రకరకాల ఫీల్డ్ లో ఫేమస్ అయినవారు పాల్గోనబోతున్నారట. వాళ్లేవరో తెలుసుకుందామా..

అందులో ధనరాజ్, ముమైత్ ఖాన్.. తనీష్, ఆదర్శ్, మహేష్ విట్టా, అషు రెడ్డి, అరియానా, అఖిల్ సార్థక్, సరయూ, హమీదా, నటరాజ్ మాసర్ బిగ్‏బాస్ మాజీ కంటెస్టెంట్స్ గా పాల్గోనబోతున్నారు. అలాగే యూట్యూబర్ నిఖిల్, యాంకర్ శివ, యాంకర్ స్రవంతి, ఆర్జే చైతూ, మిస్టర్ ఇండియా 2021 మోడల్ అనిల్ రాథోడ్, బమ్ చిక్ బబ్లూ, కప్పు ముఖ్యం బిగులూ, నటి.. మోడల్ మిత్రా శర్మ ఎంట్రీ ఇవ్వనున్నారట. అయితే ఇందులో కచ్చితంగా ఎవరెవరు పాల్గోననున్నారో తెలియాలంటే ఈనెల 26 వరకు ఆగాల్సిందే.

Also Read: Viral Photo: అపరంజి బొమ్మ.. అందాల జాబిల్లి.. అప్పట్లో తెలుగునాట సెన్సేషన్.. ఎవరో గుర్తించారా..?

Sreeleela : ఈ ముద్దుగుమ్మ అదృష్టం మామూలుగాలేదుగా.. మహేష్ మూవీలో ఆ పాత్రలో శ్రీలీల

AP Movie Ticket Issues: ఊ అంటారా.. ఊఊ అంటారా? సినిమా టికెట్లపై తేల్చేయనున్న ప్రత్యేక కమిటీ

Bhumika: బీచ్ లో రచ్చ చేస్తు ఫోటోలకు ఫోజులిచ్చిన టాలీవుడ్ ముద్దుగుమ్మ… తరగని అందంతో భూమిక వైరల్ అవుతున్న ఫొటోస్…