AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Movie Ticket Issues: ఊ అంటారా.. ఊఊ అంటారా? సినిమా టికెట్లపై తేల్చేయనున్న ప్రత్యేక కమిటీ

AP Movie Ticket Issues: తెలంగాణ(Telangana)లో అతి వృష్టి.. ఆంధ్రా(Andhra)లో అనావృష్టి అన్నచందంగా ఉంది సినిమా థియేటర్ టికెట్ ధరల విషయం. తెలంగాణలో ఎక్కువ ధరలు ఉన్నాయని..

AP Movie Ticket Issues: ఊ అంటారా.. ఊఊ అంటారా? సినిమా టికెట్లపై తేల్చేయనున్న ప్రత్యేక కమిటీ
Upcoming Telugu Movies
Surya Kala
|

Updated on: Feb 16, 2022 | 7:32 PM

Share

AP Movie Ticket Issues: తెలంగాణ(Telangana)లో అతి వృష్టి.. ఆంధ్రా(Andhra)లో అనావృష్టి అన్నచందంగా ఉంది సినిమా థియేటర్ టికెట్ ధరల విషయం. తెలంగాణలో ఎక్కువ ధరలు ఉన్నాయని అంటుంటే.. ఏపీలో సినిమా టికెట్ ధరలు మరీ తక్కువగా ఉన్నాయనే వివాదం గత కొన్ని రోజులుగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో రేపు (ఫిబ్రవరి 17వ తేదీన) సినిమా టికెట్ రేట్లకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం కానుంది. వెలగపూడిలో సచివాలయంలో 11.30 నిమిషాలకు ఈ భేటీ జరగనుంది. అనంతరం ఈ కమిటీ ప్రభుత్వనికి ధరల విషయంపై ఒక నివేదికను ఇవ్వనుంది. దీంతో  టాలీవుడ్‌ దృష్టంతా అటేవుంది. ఒకవేళ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం కనుక టికెట్ ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటే.. ఈనెల 25న రిలీజ్ కానున్న పవన్ కళ్యాణ్ తాజా సినిమా భీమ్లా నాయక్ సినిమా మొదటి బెనిఫిట్ పొందనున్నది.

అయితే ఏపీలో టికెట్ ధరల విషయంపై చిరంజీవి నేతృత్వంలో సినీ పెద్దలు, సీఎం జగన్ తో భేటీ అవుతూనే ఉన్నారు. ఇప్పటి వరకూ స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. మరోవైపు సినిమా రంగ సమస్యలకు సంబంధించి ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో మా అధ్యక్షుడు మంచు విష్ణు భేటీ అయ్యారు. ఇప్పటికే సినిమా టికెట్ రేట్లను సవరిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 35ను సవాల్ చేస్తూ కొందరు కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు కమిటీ తీసుకునే నిర్ణయం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Also Read:

 ఫ్యామిలీస్‌తో క‌లిసి చూసే అందమైన సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు: రాధికా శరత్ కుమార్

చిన్న సినిమాకు అండగా మెగాస్టార్.. సురభి 70 ఎంఎం మూవీకి మెగా విషెస్