AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalaavathi Song: సూపర్బ్.. అదిరిపోయిన కళావతి సాంగ్ మేకింగ్ వీడియో.. నెట్టింట్లో ట్రెండింగ్..

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu).. డైరెక్టర్ పరశురామ్ (Parashuram) కాంబోలో తెరకెక్కుతున్న లేటేస్ట్ చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata).

Kalaavathi Song: సూపర్బ్.. అదిరిపోయిన కళావతి సాంగ్ మేకింగ్ వీడియో.. నెట్టింట్లో ట్రెండింగ్..
Kalaavathi Song
Rajitha Chanti
|

Updated on: Feb 18, 2022 | 9:29 AM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu).. డైరెక్టర్ పరశురామ్ (Parashuram) కాంబోలో తెరకెక్కుతున్న లేటేస్ట్ చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్‏గా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రానికి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ త‌మ‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. ఇందులో మహేష్ మరింత్ స్టైలిష్ లుక్‏లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమా పై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన కళావతి పాటకు భారీ స్తాయిలో రెస్పాన్స్ వస్తోంది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మన్, సింగ‌ర్ సిద్ శ్రీరామ్ మరియు లిరిసిస్ట్‌ అనంత శ్రీరామ్ సమిష్టి కృషితో ఈ పాట రికార్డు వ్యూస్ సాధించి మెలొడి సాంగ్ ఆఫ్ ది ఇయ‌ర్‌గా నిలిచింది.

ఇదిలా ఉంటే.. తాజాగా కళావతి సాంగ్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ వీడియోలో మహేష్, కీర్తి సురేష్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ తమన్, మహేష్, డైరెక్టర్ పరశురామ్ ఫన్నీగా గడిపినట్టుగా తెలుస్తోంది. ఈ వీడియోకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఆకస్మాత్తుగా సర్‏ప్రైజ్ ఇచ్చిన మేకర్స్‏కు థ్యాంక్స్ చెబుతున్నారు మహేష్ ఫ్యాన్స్. అలాగే కీర్తి సురేష్, మహేష్ బాబు లుక్స్ అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ల మీద నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ మధి సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. కళావతి సాంగ్ మేకింగ్ వీడియోను మీరు చూసేయ్యండి.

Also Read: Samantha: పూజా హెగ్డే ఛాలెంజ్‏కు సమంత కౌంటర్.. లేట్ అయితే ఇలాగే ఉంటుందంటూ..

Health Tips: ఉదయం లేవగానే ఫోన్ చూస్తున్నారా ? అయితే ప్రమాదమే అంటున్న నిపుణులు..

Amala Paul: అమలా పాల్‌ కండిషన్‌కు అదిరిపడ్డ నిర్మాతలు.. మా వల్ల కాదు బాబోయ్‌ అంటూ..

Bigg Boss OTT: బిగ్‏బాస్ ఓటీటీ కంటెంస్టెంట్స్ వీళ్లే.. నెట్టింట్లో పైనల్ లిస్ట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..