Viral Video: ద్యావుడా.. ఇదెక్కడి టెస్ట్ రా బాబు.. టెస్టీ ఫుడ్‏ను ఎలా చేశారో చూడండి..

ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల వీడియోస్ వైరల్ అవుతుంటాయి. అందులో ఫన్నీ వీడియోస్ మాత్రమే కాదు.. వంటకాల వీడియోస్ కూడా

Viral Video: ద్యావుడా.. ఇదెక్కడి టెస్ట్ రా బాబు.. టెస్టీ ఫుడ్‏ను ఎలా చేశారో చూడండి..
Viral
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 18, 2022 | 10:54 AM

ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల వీడియోస్ వైరల్ అవుతుంటాయి. అందులో ఫన్నీ వీడియోస్ మాత్రమే కాదు.. వంటకాల వీడియోస్ కూడా పుష్కలంగా ఉన్నాయి. వంటలను ఏలా చేయాలి.. టెస్టీ ఫుడ్ ఎక్కడ లభిస్తుంది.. స్ట్రీట్ ఫుడ్ ఎక్కడ ఫేమస్.. ఇలా రకరకాల ఫుడ్ ఐటమ్స్‏కు వీడియోస్ చక్కర్లు కొడుతుంటాయి. అయితే గత కొద్ది రోజులుగా టెస్టీగా ఉండే వంటలను తమ అతి తెలివితో విచిత్రంగా ట్రై చేస్తున్నారు. రోజ్ పకోడి.. చాక్లెట్ పానీపూరి, ఐస్ క్రీమ్ సమోసా.. ఇలా వేరు వేరు రుచి ఉన్న ఫుడ్స్ అన్నింటిని ఒక్కచోట చేర్చి మరో వంటకాన్ని రెడీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మిడీయాలో అధికంగా ఉన్నాయి. తాజాగా మరో విచిత్ర వంటకం నెట్టింట్లో వైరల్ అవుతుంది.

చోలే బతురే.. ఇది పంజాబీ ఫేమస్ వంటకం..ఈ ఫుడ్ టెస్ట్‏ను ఇష్టపడని వారుండరు. చోలే బతురే అంటే ఏంటీ అనుకుంటున్నారా ? మరేం లేదండీ.. శనగల కర్రీ.. దీనికి రాష్ట్రాల వారిగా అభిమానులు ఉన్నారు. చిన్న పెద్ద ఎంతో ఇష్టంగా లాగించేస్తుంటారు. అలాంటి చోలే బతురను ఐస్ క్రీంతో మరో విచిత్ర వంటకాన్ని చేస్తున్నారు. ఆ వీడియోలో ఓ వ్యక్తి ఎంతో స్పైసీగా ఉండే చోలే బతురను తీసుకుని అందులో ఐస్ క్రీమ్ కలిపి రోల్స్ తయారు చేస్తున్నాడు. ఆ తర్వాత అందులో ఉల్లిపాయాలు వేసి కలిపాడు. అలా చేసి దానిని రోల్స్ మాదిరిగా చేసి విక్రయిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇలా మంచి టెస్టీ ఫుడ్ ను ఎందుకు ఇలా మారుస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోను మీరు చూసేయ్యండి.

Also Read: Samantha: పూజా హెగ్డే ఛాలెంజ్‏కు సమంత కౌంటర్.. లేట్ అయితే ఇలాగే ఉంటుందంటూ..

Health Tips: ఉదయం లేవగానే ఫోన్ చూస్తున్నారా ? అయితే ప్రమాదమే అంటున్న నిపుణులు..

Amala Paul: అమలా పాల్‌ కండిషన్‌కు అదిరిపడ్డ నిర్మాతలు.. మా వల్ల కాదు బాబోయ్‌ అంటూ..

Bigg Boss OTT: బిగ్‏బాస్ ఓటీటీ కంటెంస్టెంట్స్ వీళ్లే.. నెట్టింట్లో పైనల్ లిస్ట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..