Viral Video: నీళ్ళ బాటిల్‌లో ఇరుక్కున్న చిరుత పిల్ల తల.. చివరకు ఏం జరిగిందంటే..!
Viral Video: వాటర్ క్యాన్‌లో చిరుత పిల్ల తల ఇరుక్కోవడంతో తిండి నీరు, గాలి లేక ఇబ్బంది పడింది. అటవీ శాఖ చివరకు ప్లాస్టిక్‌ను తొలగించి..
Viral Video: వాటర్ క్యాన్‌లో చిరుత పిల్ల తల ఇరుక్కోవడంతో తిండి నీరు, గాలి లేక ఇబ్బంది పడింది. అటవీ శాఖ చివరకు ప్లాస్టిక్‌ను తొలగించి చిరుత పిల్లను రక్షించారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ ఘటన జరిగింది. అడవిలో పార్టీ జరుపుకున్న కొందరు టూరిస్టులు వాటర్ క్యాన్‌ను అక్కడే వదిలి పోయారు. అయితే దాహంతో ఒక చిరుత పులి పిల్ల నీటిని తాగేందుకు ప్రయత్నించగా దాని తల ఆ టిన్‌లో ఇరుక్కుపోయింది.
కాగా, వాటర్ టిన్‌లో తల ఇరుక్కున్న చిరుత పిల్లను అటువైపుగా కారులో వెళ్తున్న ఒక వ్యక్తి గమనించాడు. తన మొబైల్‌లో రికార్డ్ చేసి ట్విట్టర్‌లో అటవీ శాఖకు ట్యాగ్ చేశాడు. దీంతో అటవీ సిబ్బంది స్థానికులతో కలిసి బృందాలుగా ఏర్పడి చిరుత పిల్ల కోసం వెతికారు. బద్లాపూర్ గ్రామం సమీపంలోనే ఇది మరోసారి కనిపించింది. దీంతో దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి తలకు ఇరుక్కున్న వాటర్ టిన్‌ను తొలగించారు.
Also read: