AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine crisis: ఏ మార్గంలో పుతిన్‌ ఎటాక్‌ చేస్తాడు.. ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రపంచ పెద్దన్న..

ఏ మార్గంలో పుతిన్‌ ఎటాక్‌ చేస్తారనే ఉత్కంఠ యూరప్‌ దేశాలకు కునుకులేకుండా చేస్తోంది. రష్యాకు వ్యతిరకేంగా.. బల్గేరియా ఎయిర్‌పోర్టులో జెట్‌ ఫైటర్లను దింపారు నాటో దళాలు. తగ్గేదే లే..

Russia Ukraine crisis: ఏ మార్గంలో పుతిన్‌ ఎటాక్‌ చేస్తాడు.. ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రపంచ పెద్దన్న..
Russia Ukraine Crisis Unite
Sanjay Kasula
|

Updated on: Feb 18, 2022 | 9:40 AM

Share

రష్యా (Russia)యుద్ధం మొదలుపెట్టిందా..? ఉక్రెయిన్‌పై(Ukraine) రష్యా యుద్ధం చేసి తీరుతుందని అమెరికా(United States) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఉక్రెయిన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసే కుట్రలకు తెరతీసిందా..? ఇప్పుడు ప్రపంచమంతా ఊపిరి బిగబట్టి అటువైపే చూస్తోంది. రష్యా-ఉక్రెయిన్ బోర్డర్‌లో ఏం జరుగుతోంది. అనేకంటే.. ఏ మార్గంలో పుతిన్‌ ఎటాక్‌ చేస్తారనే ఉత్కంఠ యూరప్‌ దేశాలకు కునుకులేకుండా చేస్తోంది. రష్యాకు వ్యతిరకేంగా.. బల్గేరియా ఎయిర్‌పోర్టులో జెట్‌ ఫైటర్లను దింపారు నాటో దళాలు. తగ్గేదే లే దంటున్నారు. అసలే.. కరోనా మహమ్మారితో ఆర్థిక వ్యవస్థలు కుదేలైన నేపథ్యంలో.. యుద్ధం మిగిల్చే అపార నష్టాన్ని తలుచుకుంటేనే పాలకుల వెన్నులో వణుకు పుడుతోంది. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధ మేఘాలు పూర్తిగా తొలగిపోలేదు. లక్ష మంది సైన్యాన్ని బోర్డర్‌లో మోహరించి.. గంటల వ్యవధిలోనే కొందరిని వెనక్కి పిలిపించిన రష్యా.. మరో రూట్‌లో ఎటాక్‌ చేస్తున్నట్టు కనిపిస్తోంది.

అవును.. మొన్న ఉక్రెయిన్‌పై సైబర్‌ ఎటాక్‌ చేసింది. ఆ దేశ డిఫెన్స్‌ వ్యవస్థకు ఊపిరాడట్లేదు. ఆ వ్యవస్థలన్నీ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఇప్పుడు తూర్పు ఉక్రెయిన్‌ లోని లుషాంక్‌ ప్రాంతంలో ఉన్న కాడివ్కాలో కాల్పుల మోత మోగుతోంది. ఉక్రెయిన్‌ పాలకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీన్ని రష్యా చేస్తున్న యుద్ధంగా చెప్పలేకపోతున్నా.. మాస్కో మద్దతున్న వేర్పాటువాదులు, ఉక్రెయిన్‌ సైనికుల మధ్య భీకర కాల్పులు బీభత్సం సృష్టిస్తున్నాయి.

గ్రనేడ్లు, భారీ ఆయుధాలతో వేర్పాటువాదులు కాల్పులు జరిపినట్లు ఉక్రెయిన్‌ సైన్యం చెప్తోంది. రష్యా ప్రోద్బలంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు ఆరోపిస్తున్నారు. అయితే.. ప్రభుత్వ బలగాలే తమపై కాల్పులు జరిపినట్లు వేర్పాటువాదులు అంటున్నారు. ఒక్కరోజులోనే నాలుగైదు సార్లు కాల్పులకు తెగబడ్డారు. అటు.. సరిహద్దుల్లో రష్యా సైన్యం మోహరించి ఉంది. ఇటు ఇంటర్నల్‌గా వేర్పాటువాదులు కాల్పులు మొదలుపెట్టేశారు. దీంతో ఏం చేయాలనేది ఉక్రెయిన్‌కు అంతు చిక్కడం లేదు. ఈ పరిణామాలను అమెరికా నిశితంగా పరిశీలిస్తోంది.

ఉక్రెయిన్‌పై యుద్ధానికి సరైన కారణం రష్యా దగ్గర లేదని అమెరికా అభిప్రాయం. సరైన కారణం దొరకబట్టుకునేందుకు పుతిన్‌ స్కెచ్‌ వేశారని.. అందులో భాగంగానే వేర్పాటువాదులు గ్రనేడ్లతో రెచ్చిపోయారని భావిస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా కచ్చితంగా యుద్ధానికి దిగుతుందని నిక్కచ్చిగా చెప్తోంది అమెరికా. ఆ ఆరోపణలను రష్యా ఖండిస్తోంది. సరిహద్దుల నుంచి సైన్యాన్ని వెనక్కి రప్పిస్తున్నామని.. ఇప్పటికే లక్ష మందికి పైగా జవాన్లు వచ్చేస్తున్నారని చెప్తోంది. అటు.. శాటిలైట్ చిత్రాల్లో మాత్రం ఇంకా వేలసంఖ్యలో రష్యా సైనికులు సరిహద్దుల్లోనే మోహరించి ఉన్నారని చెప్తున్నాయి.

ఇవి కూడా చదవండి: Petrol Diesel Price: రష్యా-ఉక్రెయిన్ రచ్చ కారణంగా పెరిగిన ముడి చమురు ధరలు.. మన దేశంలో మాత్రం పెట్రోల్-డీజిల్ ధరలు ఇలా..

CM Jagan: గుంటూరు జిల్లాలో ఇస్కాన్ అక్షయపాత్ర.. ప్రారంభించనున్న సీఎం జగన్..