Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI Payments: ఆ దేశంలో భారత్ UPI సేవలు.. ఆ అయిదు అంశాలే కీలకం..

UPI Payments: ఇంటర్నెట్ సేవలు విసృతం అయ్యాక యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులు సర్వసాధారణమయ్యాయి. భారత్ కు చెందిన.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ విభాగం గురువారం..

UPI Payments: ఆ దేశంలో భారత్ UPI సేవలు.. ఆ అయిదు అంశాలే కీలకం..
Upi Payments
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Feb 18, 2022 | 10:43 AM

UPI Payments: ఇంటర్నెట్ సేవలు విస్తృతం అయ్యాక యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులు సర్వసాధారణమయ్యాయి. భారత్ కు చెందిన.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ విభాగం గురువారం నేపాల్‌లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)ని ఇంటర్‌ ఆపరబుల్ రియల్-టైమ్ పర్సన్-టు-పర్సన్ (P2P), పర్సన్ టు మర్చంట్, పొటెన్షియల్ క్రాస్‌ని పెంపొందించనున్నట్లు ప్రకటించింది. దీని వల్ల నేపాల్- భారతదేశం మధ్య చెల్లింపులు ఊపందుకోనున్నాయి. రాబోయే కొద్ది నెలల్లో ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్, గేట్‌వే పేమెంట్స్, మనం ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు కలిసి సంయుక్తంగా నేపాల్ లో పేమెంట్ సేవలను అందించనున్నాయి. ప్రస్తుతం భారత్ లో తమ సేవల్లో అందిస్తున్న అన్ని ఫీచర్లు అక్కడ కూడా అందించనున్నట్లు స్పష్టం చేశాయి.

కేవలం 2021 సంవత్సరంలో యూపీఐ ద్వారా చేసిన చెల్లింపుల విలువ 940 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది భారతదేశ జీడీపీలో దాదాపు 31 శాతానికి సమానమైనది. యూపీఐ రియల్ టైమ్ చెల్లింపుల వ్యవస్థను నేపాల్ లో ప్రారంభించడం ఫైనాన్సియల్ ఇక్లూజన్ జరుగి వ్యాపార అభివృద్ధికి తోర్పడనుంది. దీని వల్ల నేపాల్ లోని చెల్లింపుల వ్యవస్థ ఆధునికీకరించబడుతుంది. అక్కడి ప్రజలకు డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ మరింత చేరువకానుంది.

దీనికి సంబంధించి తెలుసుకోవలసిన 5 కీలక అంశాలు ఏమిటంటే..

1. NPCI ఇంటర్నెష్నల్ పేమెంట్స్ లిమిటెడ్ తమ యూపీఐ చెల్లింపులను నేపాల్ లో అందిస్తుంది.

2. రియల్ టైమ్ పేమెంట్ల సేవలు నేపాల్ లో అందిచబడతాయి. దీని ద్వారా చెల్లింపులను ప్రజాస్వామ్యీకరించడానికి, నగదు చెల్లింపులు చేయడానికి NPCI సాంకేతికతను ఉపయోగించుకోవడం జరుగుతుంది.

3. దీని ద్వారా రెండు దేశాల మధ్య రియల్ టైమ్ పర్సన్ టు పర్సన్ చెల్లింపులకు సౌలభ్యం లభిస్తుంది.

4. నేపాల్ రాష్టీయ బ్యాంక్ తరఫున గేట్ వే పేమెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ సేవలను మ్యానేజ్ చేస్తుంది.

5. భారత్ తరఫున మనం ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నేపాల్ లోని గేట్ వే పేమెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు యూపీఐ టెక్నాలజీ సేవలను అందిస్తుంది.

ఇవీ చదవండి..

ABG Shipyard: 23 వేల కోట్లు స్కామ్ చేసిన ఏబీజీ ఫిప్ యార్డ్ కంపెనీ కేసులో మరో ట్విస్ట్.. వెలుగులోకి కొత్త వాస్తవాలు..

Reliance Jio: రిలయన్స్ జియోకు గట్టి ఎదురుదెబ్బ.. మళ్లీ షాకిచ్చిన కస్టమర్లు..