Reliance Jio: రిలయన్స్ జియోకు గట్టి ఎదురుదెబ్బ.. మళ్లీ షాకిచ్చిన కస్టమర్లు..

Reliance Jio: టెలికాం దిగ్గజం జియో ఎన్ని ప్రయత్నాలు చేసినా.. సంస్థకు కస్టమర్ల నుంచి ఎదురుదెబ్బ తగులుతూనే ఉంది. ప్రత్యర్థి ఎయిర్ టెల్ కు పోటీగా ఎన్ని ఆఫర్లు, సర్వీసులు తెచ్చినా మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. దీనికి సంబంధించి..

Reliance Jio: రిలయన్స్ జియోకు గట్టి ఎదురుదెబ్బ.. మళ్లీ షాకిచ్చిన కస్టమర్లు..
Reliance Jio
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Feb 18, 2022 | 9:10 AM

Reliance Jio: టెలికాం దిగ్గజం జియో ఎన్ని ప్రయత్నాలు చేసినా.. సంస్థకు కస్టమర్ల నుంచి ఎదురుదెబ్బ తగులుతూనే ఉంది. ప్రత్యర్థి ఎయిర్ టెల్(Bharati Airtel) కు పోటీగా ఎన్ని ఆఫర్లు, సర్వీసులు తెచ్చినా మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. దీనికి సంబంధించి తాజా సమాచారం ప్రకారం 1.29 కోట్ల మంది వినియోగదారులు జియోను వీడారని గణాంకాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మాత్రం 4 జీ సేవలు ప్రారంభించిన నాటి నుంచి తన కస్టమర్ల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. గడచిన డిసెంబర్ నెలకు సంబంధించి ఈ సమాచారాన్ని టెలికాం రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. ఎక్కువ మంది చందాదారులను కోల్పోయిన కంపెనీల్లో జియో, వొడఫోన్ ఐడియా నిలిచాయి. వొడఫోన్ ఐడియా నుంచి 16 లక్షలకు పైగా చందాదారులు బయటకు వెళ్లిపోయారని ట్రాయ్ వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి.

ధరలు పెంచి చందాదారులపై భారాన్ని పెంచాలనుకుంటున్నప్పటికీ దిగ్గజ టెలికాం భారతీ ఎయిర్ టెల్ మాత్రం తగ్గేదే అంటూ కొత్త కస్టమర్లను ఎట్రాక్ట్ చేస్తూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం దేశంలో జియో వినియోగదారుల సంఖ్య 41.57 కోట్లగా ఉండగా.. బిఎస్ఎన్ఎల్ కొత్తగా 11 లక్షల మందిని తన నెట్ వర్క్ లోకి చేర్చుకుంది. మెుత్తానికి చాలా కాలం తరువాత బిఎస్ఎన్ఎల్ పైపు వినియోగదారులు తిరిగి మెుగ్గుచూపుతున్నారు.

ఇవీ చదవండి..

META: భారత్ లో ఆ సేవలను నిలిపివేసిన ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా.. ఎందుకంటే..

Tax Saving: సెక్షన్- 80C కింద గరిష్ఠంగా పన్ను రాయితీ పొందినా.. మరింతగా పన్ను తగ్గించుకోవడానికి ఇలా చేయండి..