AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railway: ట్రైన్ టికెట్ వేరేవారి పేరు మీదకు బదిలీ చేయడం ఎలా..? ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చా..? రైల్వే శాఖ రూల్స్ ఇవే..

రైలు ప్రయాణం చేయడానికి ముందుగానే అడ్వాన్స్‌డ్ టికెట్ రిజర్వేషన్ ఆన్‌లైన్‌లో చేసుకుంటూ ఉంటాం. రైల్వే టికెట్ బుకింగ్ చేసుకునే సమయంలో ప్రయాణికుల వివరాలన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. పేరు, వయస్సు, లింగం వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. ఇవి తర్వాత మార్చుకోవచ్చా అనే డౌట్ చాలామందికి ఉంటుంద

Indian Railway: ట్రైన్ టికెట్ వేరేవారి పేరు మీదకు బదిలీ చేయడం ఎలా..? ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చా..? రైల్వే శాఖ రూల్స్ ఇవే..
Train Tickets
Venkatrao Lella
|

Updated on: Feb 26, 2026 | 6:24 PM

Share

ట్రైన్ టికెట్ ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసే సమయంలో బుకింగ్ చేసే వ్యక్తి వివరాలతో పాటు అతడితో పాటు కలిసి ప్రయాణించే వ్యక్తుల వివరాలన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక ట్రైన్ ఎక్కాక టీసీలు టికెట్‌తో పాటు కన్పర్మేషన్ కోసం ఏదైనా గుర్తింపు ధృవీకరణ పత్రం అడుగుతూ ఉంటారు. ఈ సమయంలో ఖచ్చితంగా అందించాల్సి ఉంటుంది. అయితే టికెట్ రిజర్వేషన్ పూర్తయ్యాక టికెట్‌లోని పేరు మార్చుకోవచ్చా లేదా అనే అనుమానం చాలామందికి ఉంటుంది. వాటి వివరాలు ఒకసారి చూద్దాం.

పేరు మార్చుకోవాలంటే..?

టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికుల పేర్లను మార్చుకునే అవకాశం రైల్వేశాఖ కల్పిస్తోంది. ఇందుకోసం పలు నిబంధనలు ఉన్నాయి. ట్రైన్ బయలుదేరడానికి 24 గంటల ముందు మాత్రమే మార్చుకునే అవకశముంది. ఎలక్ట్రానిక్ రిజర్వేషన్ స్లిప్ ప్రింటవుట్, చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు పత్రంతో సమీపంలోని రైల్వే రిజర్వేషన్ కార్యాలయాన్ని సంప్రదించాలి. అప్పుడు సిబ్బంది పరిశీలించి పేర్లను మారుస్తారు.

టికెట్‌ను వేరేవారి పేరుపై బదిలీ చేయాలంటే..?

-ఇక టికెట్‌ను వేరేవారి పేరుపై బదిలీ చేయడానికి సంబంధిత డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ లేదా ప్రధాన స్టేషన్లలో చీఫ్ రిజర్వేషన్ సూపర్‌వైజర్ ఈ అధికారం కలిగి ఉంటారు. కుటుంబంలోని వేరే వ్యక్తికి బదిలీ చేయడానికి ట్రైన్ షెడ్యూల్ సమయానికి 24 గంటల ముందు వ్రాతపూర్వకంగా అభ్యర్థనను సమర్పించాలి. అలాంటి సమయంలో మీ కుటుంబంలోని వేరే సభ్యుని పేరు మీదకు బదిలీ చేస్తారు. తండ్రి, తల్లి, భార్య, భర్త, సోదరుడు, సోదరి, కొడుకు, కుమార్తె పేరు మీదకు బదిలీ చేసుకోవచ్చు. స్టేషన్ మేనేజర్‌కు కూడా మార్చే అధికారం ఉంటుంది.

-ఇక విద్యార్థులు అయితే విద్యాసంస్థ అధిపతి 48 గంటల ముందు వ్రాతపూర్వకంగా అభ్యర్థన సమర్పించాలి. అప్పుడు అదే సంస్థలోని మరో విద్యార్థి పేరు మీదకు టికెట్ బదిలీ అవుతుంది.

-ఇక అధికారిక వీధుల్లో ప్రయాణించే ప్రభుత్వ ఉద్యోగి అయి ఉంటే 24 గంటల ముందు లిఖితపూర్వకంగా రాసి ఇస్తే టికెట్ బదిలీ అవుతుంది

-ప్రయాణికులు వివాహ బృందానికి చెందినవారైతే, ఆ బృందానికి అధిపతిగా భావించే వ్యక్తి ట్రైన్ షెడ్యూల్‌కు 48 గంటల ముందు బృందంలోని మరోక సభ్యుని పేరు మీదకు బదిలీ చేయవచ్చు. ఇందుకోసం రైల్వే సిబ్బంది ఆశ్రయించి లిఖితపూర్వకంగా దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.

-ఇక ఎన్‌సీసీ క్యాండెట్లు అయితే గ్రూప్ నాయకుడు 24 గంటల మందు సమూహంలోని వేరే వారి పేరు మీదకు బదిలీ చేయవచ్చు

-ఒక్కసారి మాత్రమే ఇలాంటి అభ్యర్థనలను అనుమతిస్తారు

-గ్రూప్ బుకింగ్‌ల విషయంలో కేవలం గ్రూప్ పరిమాణంలో 10 శాతం మించి పేరు మార్పులను అనమతించరు

-రాయితీపై జారీ చేసే టికెట్లకు పేరు మార్చుకోవడానికి అనుమతి లేదు

Follow Us
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. గెజిటెడ్ అధికారులకు కొత్త నిబంధనలు..
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. గెజిటెడ్ అధికారులకు కొత్త నిబంధనలు..
ఎత్తుకు పైఎత్తు వేసి శత్రువును గెలవాలి.. కాకి – పాము కథ
ఎత్తుకు పైఎత్తు వేసి శత్రువును గెలవాలి.. కాకి – పాము కథ
10 నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ.. ఈ ఒక్క పనితో..
10 నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ.. ఈ ఒక్క పనితో..
ఈమె పాడి పరిశ్రమలో విజయం సాధించిన తీరు చాలామందికి ఆదర్శం
ఈమె పాడి పరిశ్రమలో విజయం సాధించిన తీరు చాలామందికి ఆదర్శం
ఏపీలో FNCC నిర్మాణానికి లైన్‌ క్లియర్.. త్వరలోనే అధికారిక జీవో!
ఏపీలో FNCC నిర్మాణానికి లైన్‌ క్లియర్.. త్వరలోనే అధికారిక జీవో!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..
బిసిసిఐ కొత్త కఠిన నియమాలతో ఆటగాళ్లకు షాక్
బిసిసిఐ కొత్త కఠిన నియమాలతో ఆటగాళ్లకు షాక్
ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు వాడుతున్నారా? జాగ్రత్త..
ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు వాడుతున్నారా? జాగ్రత్త..
NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. పెద్ద నటుడయ్యాడు.
అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. పెద్ద నటుడయ్యాడు.