META: భారత్ లో ఆ సేవలను నిలిపివేసిన ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా.. ఎందుకంటే..

META: దేశంలో తక్కువ ఖర్చుతో వైఫై సేవలను అందించేందుకు ఫేస్ బుక్(Facebook) మాతృ సంస్థ మెటా 2016లో ఎక్స్‌ప్రెస్ వైఫై ను(Express Wifi) అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా..

META: భారత్ లో ఆ సేవలను నిలిపివేసిన ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా.. ఎందుకంటే..
Facebook Meta
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Feb 18, 2022 | 8:13 AM

META: దేశంలో తక్కువ ఖర్చుతో వైఫై సేవలను అందించేందుకు ఫేస్ బుక్(Facebook) మాతృ సంస్థ మెటా 2016లో ఎక్స్‌ప్రెస్ వైఫై ను(Express Wifi) అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, మెుబైల్ మరియూ శాటిలైట్ ఆపరేటర్లు వైఫై సేవల వ్యాపారంలో వేగంగా ఎదిగేందుకు, ఆదాయం పొందేందుకు దీనిని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా చవకైన, వేగవంతమైన, నమ్మదగిన సేవలను అందించాలని మెటా అప్పట్రో భావించింది. కానీ.. 6 సంవత్సరాల తరువాత దీనిని నిలిపివేసింది. గడచిన రెండు వారాలుగా దేశంలో ఈ సేవలను నిలిపివేసింది. 20 జీబీ ఇంటర్ నెట్ ను సుమారు రూ. 400 లకు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును మెటా అప్పట్లో ప్రారంభించింది.

ప్రస్తుతం దేశంలో తన ఎక్స్‌ప్రెస్ వైఫై సేవలను నిలిపివేసినప్పటికీ.. ఇంకర్నెట్ సర్వీసెస్ విభాగంలో చేపడుతున్న ఇతర ప్రాజెక్టులు కొనసాగుతాయని వెల్లడించింది. తమ భాగస్వాములతో కలిసి ఎక్స్‌ప్రెస్ వైఫై ప్లాట్‌ఫారమ్ ద్వారా 30 కంటే ఎక్కువ దేశాల్లోని వ్యక్తుల కోసం పబ్లిక్ వైఫై యాక్సెస్‌ని విస్తరించడానికి సహకరిస్తున్నట్లు మెటా తెలిపింది. తాము ఇతర ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టడానికి.. ఈ ప్రాజెక్టును పనిని ముగించినట్టు తెలిపింది. మెరుగైన కనెక్టివిటీని అందించడానికి టెలికాం ఎకోసిస్టంలోని భాగస్వాములతో కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నట్లు మెటా వెల్లడించింది.

సేవల్లో అంతరాయాలు.. అంతర్జాతీయ మీడియా రిపోర్టు ప్రకారం మెటా అందిస్తున్న ఉచిత ఇంటర్నెట్ సేవల్లో అంతరాయాలు వస్తున్నాయని తెలిపాయి. పాకిస్థాన్ లాంటి దేశాల్లో వినియోగదారులకు ఇవి అనవసరమైన ఛార్జీల భారాన్ని కలిగిస్తున్నాయని వెల్లడించాయి. మెటా దాని స్వలాభాల కోసం ఈ సేవలను వినియోగించుకుంటోందని తెలిపాయి.

ఇవీ చదవండి..

Health Tips: ఉదయం లేవగానే ఫోన్ చూస్తున్నారా ? అయితే ప్రమాదమే అంటున్న నిపుణులు..

Tax Saving: సెక్షన్- 80C కింద గరిష్ఠంగా పన్ను రాయితీ పొందినా.. మరింతగా పన్ను తగ్గించుకోవడానికి ఇలా చేయండి..