Tax Saving: సెక్షన్- 80C కింద గరిష్ఠంగా పన్ను రాయితీ పొందినా.. మరింతగా పన్ను తగ్గించుకోవడానికి ఇలా చేయండి..
Tax Saving: పన్ను చెల్లింపులకు సంబంధించి 2021-22 ఆర్థిక సంవత్సరం(Financial year) త్వరలోనే ముగియనుంది. ఈ తరుణంలో పన్ను చెల్లింపుల కోసం డబ్బు సర్ధుబాటు చేసుకోవలసి ఉంటుంది. ఒకవేళ ఆదాయపన్ను చట్టం..
Tax Saving: పన్ను చెల్లింపులకు సంబంధించి 2021-22 ఆర్థిక సంవత్సరం(Financial year) త్వరలోనే ముగియనుంది. ఈ తరుణంలో పన్ను చెల్లింపుల కోసం డబ్బు సర్ధుబాటు చేసుకోవలసి ఉంటుంది. ఒకవేళ ఆదాయపన్ను చట్టం(Income tax law) కింద సెక్షన్- 80C గరిష్ఠంగా లభించే రూ. 1.50 లక్షలను మినహాయింపుగా పొందారా.. అయితే సెక్షన్- 80D కింద కూడా పన్ను మినహాయింపును పొందండి. ఆదాయపన్ను చట్టం ప్రకారం సెక్షన్- 80D కింద మీరు హెల్త్ ఇన్యూరెన్స్ కోసం చెల్లించే ప్రీమియం సొమ్మును కట్టాల్సిన పన్ను నుంచి మినహాయింపుగా పొందవచ్చు. ఈ సెక్షన్ కింద మీరు మరో లక్ష రూపాయిలు తగ్గింపు పొందవచ్చు. మీ కుటుంబం కోసం చెల్లించిన ఆరోగ్య బీమా ప్రీమియంను దీని కింద ఎక్సెమ్షన్ పొందవచ్చు.
60 సంవస్సరాలకంటే తక్కువ వయస్సు కలిగిన వారు ఆరోగ్య బీమా కింద చెల్లించిన ప్రీమియంలో(Health insurance premium) రూ. 25 వేలు తగ్గింపుగా పొందవచ్చు. అదే 60 ఏళ్లకు పైబడిన వారు రూ. 50 వేలు మినహాయింపు పొందవచ్చు. అదే సదరు వ్యక్తి తనకు, 60 ఏళ్లు వయస్సు దాటిన తన తల్లిదండ్రులకు కలిపి ప్రీమియం చెల్లిస్తే మెుత్తం రూ. 75 వేల వరకు మినహాయింపు లభిస్తుంది. అదే ట్యాక్స్ చెల్లించే వ్యక్తి కూడా 60 ఏళ్లకు పైబడిన వాడయితే, తన తల్లిందండ్రులకు కూడా ప్రీమియం చెల్లిస్తే గరిష్ఠంగా రూ. లక్ష పన్ను మినహాయింపును ఆదాయపన్ను శాఖ అందిస్తోంది. ఇకపై మీరు చెల్లిస్తున్న ఆరోగ్య బీమా చెల్లింపులను కూడా పన్ను మినహాయింపు పొందేందుకు వినియోగించుకోవడం మరచిపోకండి. కానీ కేవలం ట్యాక్స్ తగ్గింపుకోసం పాలసీలు కొనకండి. మీ పూర్తి అవసరాలను తీర్చే విధంగా ఉండే పాలసీలను ఎంపిక చేసుకుని పన్ను మినహాయింపులు పొందండి.
ఇవీ చదవండి..
Warren Buffet: బిట్‌కాయిన్ పై మాట మార్చిన వారెన్ బఫెట్.. దానిలో ఎంత పెట్టుబడి పెట్టారో తెలుసా..