Warren Buffet: బిట్‌కాయిన్ పై మాట మార్చిన వారెన్ బఫెట్.. దానిలో ఎంత పెట్టుబడి పెట్టారో తెలుసా..
Warren Buffet: బిట్‌కాయిన్(Bitcoin) అంత దరిద్రం ఇంకోటి లేదని చెప్పిన టాప్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ మాట మార్చారు. తాజాగా బిట్ కాయిన్‌లో ఆయన బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. బిట్‌కాయిన్‌పై మాట మార్చారు ఇన్వెస్ట్‌మెంట్ గురు వారెన్ బఫెట్..
Warren Buffet: బిట్‌కాయిన్(Bitcoin) అంత దరిద్రం ఇంకోటి లేదని చెప్పిన టాప్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ మాట మార్చారు. తాజాగా బిట్ కాయిన్‌లో ఆయన బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. బిట్‌కాయిన్‌పై మాట మార్చారు ఇన్వెస్ట్‌మెంట్ గురు వారెన్ బఫెట్. క్రిప్టో కరెన్సీ(Cryptocurrency) విషంతో సమానమని గతంలో వ్యాఖ్యానించి బఫెట్ ఇప్పుడు బిట్‌కాయిన్‌లోనే భారీగా పెట్టుబడులు పెట్టారు. బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టారు బఫెట్. వారెన్ బఫెట్ ఏ స్టాక్‌లో పెట్టుబడులు పెట్టారో తెలుసుకోవడానికి ప్రపంచమంతా ఆసక్తితో ఎదురుచూస్తుంది. అమెరికా స్టాక్‌మార్కెట్లపై(US Stock market) ఎంతో గురి ఉన్న బఫెట్ సడెన్‌గా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో అర్థం కావడం లేదు. బఫెట్‌కు చెందిన బార్క్‌షైర్ హాత్‌వే క్రిప్టో కరెన్సీని డీల్ చేసే డిజిటల్ బ్యాంక్‌లో బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెట్టిన విషయాన్ని బార్క్‌షైర్ హాత్‌వే అధికారికంగా ప్రకటించింది.
నూబ్యాంక్(Nubank) అనే డిజిటల్ కరెన్సీలో వారెన్ బఫెట్ ఈ పెట్టుబడులు పెట్టారు. బ్రెజిల్ కేంద్రంగా నడిచే ఈ డిజిటల్ బ్యాంక్ లాటిన్ అమెరికా ప్రాంతంలో అతిపెద్దది. బ్యాంకింగ్ సిస్టమ్‌కు విరుద్ధంగా నూబ్యాంక్ పనిచేస్తుంది. బిట్ కాయిన్ డేంజర్ అని, అందులో పెట్టుబడులు పెట్టడం శుద్ధదండగ అని వారెన్ బఫెట్ వ్యాఖ్యానించారు. కొద్దిరోజుల క్రితం కూడా ఇదే వ్యాఖ్యలకు కట్టుబడిన బఫెట్ సడెన్‌గా తన నిర్ఱయాన్ని మార్చుకున్నారు. చైనా బిట్‌కాయిన్‌ను బ్యాన్ చేయడాన్ని కూడా సమర్థించిన బఫెట్ ఇప్పుడు అందులోనే పెట్టుబడులు పెట్టారు.
వారెన్ బఫెట్ ఇతర పెట్టుబడులను క్రిప్టో కరెన్సీ వైపు మళ్లిస్తున్నారు. స్టాక్‌మార్కెట్లో ఇటీవలి కాలంలో నష్టాలు రావడంతో బిట్‌కాయిన్ వైపు దృష్టి మరల్చారు వారెన్ బఫెట్. లాటిన్ అమెరికా ప్రాంతంలో సాంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం కోల్పోతున్నారు జనం. డిజిటల్ కరెన్సీ వైపు మొగ్గు చూపిస్తున్నారు. అందుకే బఫెట్ కూడా అందులో భారీగా పెట్టుబడులు పెట్టారు.
ఇవీ చదవండి..