IT Raid: ఎన్ఎస్ఈ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణపై ఐటి రెయిడ్
IT Raid: ఎన్ఎస్ఈ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణపై(Chitra rama krishna) మరోసారి ఐటి శాఖ అధికారులు రెయిడ్ చేశారు. ఇప్పటికే ఆదాయపన్ను, సెబీ(SEBI) సంస్థల విచారణలో చిత్రా రామకృష్ణ..
IT Raid: ఎన్ఎస్ఈ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణపై(Chitra rama krishna) మరోసారి ఐటి శాఖ అధికారులు రెయిడ్ చేశారు. ఇప్పటికే ఆదాయపన్ను, సెబీ(SEBI) సంస్థల విచారణలో చిత్రా రామకృష్ణ ఉన్నారు. ఆమె ఎన్ఎస్ఈ మాజీ సీఈవో ఉన్న సమయంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. దీనికి తోడు అజ్ఞాత యోగితో చిత్ర జరిపిన ఈ- మెయిల్ సంభాషణలు తాజాగా బయటకు రావడం బిజినెస్ సర్కిల్ లో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి తాజాగా ఐటీ సోదాలు జరిగాయని సీఎన్ఎన్ న్యూస్-18 వెల్లడించింది.
అసలు చిత్రా రామకృష్ణ పై అభియోగాలు ఏంటంటే..
ఎన్ఎస్ఈకి సంబంధించిన ఫైనాన్షియల్ డేటా, డివిడెండ్ నిష్పత్తులు, వ్యాపార ప్రణాళికలు, బోర్డు మీటింగ్ ఎజెండా మరియు ఉద్యోగి పనితీరు అంచనాల వంటి పూర్తి వివరాలను.. చిత్ర 5 ఏళ్ల పదవీకాలంలో సదరు యోగితో పంచుకున్నారు. కో-లొకేషన్, ఆల్గో ట్రేడింగ్ కుంభకోణం, సుబ్రమణియన్(Subramaniyan) నియామకంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు.. చిత్రా రామకృష్ణ 2016లో NSE నుంచి తొలగించబడ్డారు. ఇష్టాను సారంగా చిత్రా రామకృష్ణ ఎన్ఎస్ఈని నిర్వహించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఇవీ చదవండి..
E- Shram: ఇ-శ్రామ్ కార్డుదారులకు శుభవార్త.. వారి ఖాతాల్లోకి డబ్బులు ఎప్పుడొస్తున్నాయంటే..