E- Shram: ఇ-శ్రామ్ కార్డుదారులకు శుభవార్త.. వారి ఖాతాల్లోకి డబ్బులు ఎప్పుడొస్తున్నాయంటే..

E- Shram: దేశంలో పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలను అమలు చేస్తుంది. కేంద్రంతో పాటు, యూపీ ప్రభుత్వం(Uttar Pradesh) కూడా ఇలాంటి అనేక పథకాలను అమలు చేస్తోంది. దీని ద్వారా ఆ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజలకు..

E- Shram: ఇ-శ్రామ్ కార్డుదారులకు శుభవార్త.. వారి ఖాతాల్లోకి డబ్బులు ఎప్పుడొస్తున్నాయంటే..
E Shram Card
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Feb 17, 2022 | 12:00 PM

E- Shram: దేశంలో పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలను అమలు చేస్తుంది. కేంద్రంతో పాటు, యూపీ ప్రభుత్వం(Uttar Pradesh) కూడా ఇలాంటి అనేక పథకాలను అమలు చేస్తోంది. దీని ద్వారా ఆ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజలకు ఆర్థిక సహాయం అందించబడుతోంది. ఇ-శ్రామ్ పోర్టల్ కింద నమోదు చేసుకున్న కార్మికులకు నెలకు రూ. 500 ఇవ్వాలని యూపీలోని యోగి ప్రభుత్వం(Yogi Government) ప్రకటించింది. ఈ పథకం కింద సుమారు 2 కోట్ల మంది కార్మికుల ఇ-శ్రామ్ ఖాతాలకు ప్రభుత్వం ఇప్పటికే రూ.1000 బదిలీ చేసింది. దీని తరువాత రెండో విడత సొమ్మును లబ్ధిదారుల ఖాతాలకు బదిలీ చేసేందుకు సిద్ధమవుతోంది.

ఇప్పటికి రూ. 1000 బదిలీ..

ఇప్పటి వరకు 22 కోట్ల మందికి పైగా కార్మికులు ఇ-శ్రామ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. అదే సమయంలో, యూపీలో నమోదు చేసుకున్న వారి సంఖ్య దాదాపు 8 కోట్ల మంది వరకు ఉంది. యుపీలోని యోగి ప్రభుత్వం గత నెలలో ఈ కార్మికుల ఖాతాకు రూ.1000 మెుదటి విడతగా ఇప్పటికే బదిలీ చేసింది.

మెుత్తం రూ. 2000 చెల్లింపుకు ప్రణాళిక..

ఈ పోర్టల్‌లో నమోదు చేసుకున్న వారికి మొత్తం రూ. 2000 ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటికే మెుదటి విడతగా రూ. 1000 ఖాతాలకు బదిలీ చేయడం జరిగింది. త్వరలోనే యూపీ ప్రభుత్వం తన రెండో విడత రూ.1000 చెల్లించనుంది. ఈ క్రమంలో లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ఈ పథకం కింద యోగి ప్రభుత్వం డిసెంబర్ నుంచి మార్చి వరకు రూ. 1000 బదిలీ చేయవచ్చు. అంటే హోలీ వరకు మీ ఖాతాకు సొమ్ము చెల్లించవచ్చు. అసెంబ్లీ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున.. కొత్త ప్రభుత్వం వచ్చాక మరో రూ. 1000 లబ్ధిదారులకు అందనున్నట్లు తెలుస్తోంది.

ఇ-శ్రామ్ కోసం ఎలా నమోదు చేసుకోవాలి..

ఈ పథకం కింద నమోదు చేసుకోవడానికి ముందుగా మీరు మీ ఫోన్‌లోని ఇ-శ్రామ్ మొబైల్ అప్లికేషన్‌కు వెళ్లాలి. లేదా అధికారిక వెబ్‌సైట్‌ను కూడా సందర్శించవచ్చు. ఇది కాకుండా, మీరు కామన్ సర్వీస్ సెంటర్, స్టేట్ సర్వీస్ సెంటర్, పోస్ట్ ఆఫీస్ డిజిటల్ సేవా కేంద్రాన్ని కూడా సంప్రదించవచ్చు.

ఇవీ చదవండి..

IT Raid: ఎన్ఎస్ఈ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణపై ఐటి రెయిడ్

Tax Saving Investment: అందులో పెట్టుబడి పెట్టేందుకు అందరి ఆసక్తి.. మూడు రెట్లు అధిక పన్ను మినహాయింపు.. ఎలాగంటే..