Tax Saving Investment: అందులో పెట్టుబడి పెట్టేందుకు అందరి ఆసక్తి.. మూడు రెట్లు అధిక పన్ను మినహాయింపు.. ఎలాగంటే..

Tax Free Investment: ఆదాయపన్ను మిగల్చడంలో ఆ ఫండ్ కు మించిన మరో అత్యుత్తమమైన మార్గం లేనడం అతిశయోక్తి కాదు. దీనిలో పెట్టుబడి పెట్టడం వల్ల మూడింతలు ఎక్కువ ఆదాయపన్నులో తగ్గింపులు అధికంగా..

Tax Saving Investment: అందులో పెట్టుబడి పెట్టేందుకు అందరి ఆసక్తి.. మూడు రెట్లు అధిక పన్ను మినహాయింపు.. ఎలాగంటే..
Investment
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Feb 17, 2022 | 11:14 AM

Tax Saving Investment: ఆదాయపన్ను మిగల్చడంలో ఆ ఫండ్ కు మించిన మరో అత్యుత్తమమైన మార్గం లేనడం అతిశయోక్తి కాదు. దీనిలో పెట్టుబడి పెట్టడం వల్ల మూడింతలు ఎక్కువ ఆదాయపన్నులో తగ్గింపులు(Income tax reduction) లభిస్తుంది. అందుకే HNI ఇన్వెస్టర్లకు ఈ పెట్టుబడులంటే ఎక్కువ మక్కువ. పైగా దీనిలో పెట్టుబడి రిస్క్ లేనిది కావడం మరో విశేషం. ఇంతకీ దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏమిటంటే.. పబ్లిక్ ప్లావిడెండ్ ఫండ్ లో పెట్టుబడులకు మూడు రెట్లు ఆదాయపన్నులో మినహాయింపు లభిస్తుంది. కానీ దీనిని చాలా మంది ఇన్వెస్టర్లు వినియోగించుకోవడం లేదు. దీనిలో పెట్టుబడి పెట్టేటప్పుడు, దాటిన కాలానికి, సొమ్మును విత్ డ్రా చేసుకునేటప్పుడు మెుత్తం మూడు సార్లు పన్ను రాయితీ లభిస్తుంది. ఐటీ చట్టం 1961 ప్రకారం ప్రతి సంవత్సరం సెక్షన్ 80C కింద పెట్టుబడిదారునికి గరిష్ఠంగా రూ. 1.5 లక్షలు వరకు పన్ను రాయితీ లభిస్తుంది. అంతిమంగా పెట్టుబడి దారునికి వచ్చే మెుత్తానికి సైతం పన్ను నుంచి మినహాయింపు వస్తుంది.

ప్రయోజనాలు..

1. ప్రస్తుతం ఈపీఎఫ్ పెట్టుబడులకు అత్యధికంగా 8.5 శాతం వడ్డీ లభిస్తోంది. దీనిలో మరో ప్రయోజనం ఏమిటంటే పీపీఎఫ్ పెట్టుబలపై వడ్డీ రేటు ఎక్కువగా మార్పులకు గురికాదు. ఇది జీతాలు పొందే ఉద్యోగులకు లభించే మంచి సదవకాశం. కానీ పీపీఎఫ్ లో ఎవరైనా పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. పీపీఎఫ్ లపై 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. ఇది ఇతర పెట్టుబడి మార్గాల కంటే ఎక్కువనే చెప్పుకోవాలి.

2. ప్లోటింగ్ వడ్డీ రేటు ఉన్నందున ఎఫ్ డి కంటే పీపీఎఫ్ పెట్టుబడి ఉత్తమమైనది. ఎందుకంటే ఇందులో వడ్డీ రేటు మార్కెట్ తో పాటు మారడం వల్ల ఎక్కువ ప్రయోజనకరం. ఈ కారణంగా పెట్టుబడి దారుని సొమ్ము ఎకానమీలో మార్పులతో పాటు వృద్ధి చెందుతుంది.

3. ఎక్కువ లాభం రాకపోయినా తమ పెట్టుబడి సురక్షితంగా ఉండాలని ఆలోచించేవారికి పీపీఎఫ్ పెట్టుబడులు సరైన ఎంపిక అని చెప్పుకోక తప్పదు. ప్రస్తుతం మార్కెట్ లో అన్ని బ్యాంకుల తమ 5 సంవత్సరాల ఎఫ్ డి పెట్టుబడులకు చెల్లిస్తున్న వడ్డీ కంటే పీపీఎఫ్ ఎక్కువ వడ్డీని తెచ్చిపెడుతుంది. కానీ.. సీనియర్ సిటిజన్లు, శుకన్యా సమృద్ధి యోజన కింద పెట్టుబడి పెట్టిన వారికి మాత్రం దీనికంటే ఎక్కువ వడ్డీ లభిస్తోంది.

4. యుక్త వయస్సు నుంచి డబ్బు దాచుకునే వారికి చక్రవడ్డీ అందించే లాభాలు పీపీఎఫ్ పెట్టుబడిలో లభిస్తాయి. పీపీఎఫ్ అకౌంట్ మెచూరిటీ గరిష్ఠంగా 15 సంవత్సరాలుగా ఉంది. మెచూరిటీ తరువాత మీరు దాచుకున్న మెుత్తాన్ని వెనక్కు తీసుకోవడానికి లేదా మరో 5 సంవత్సరాలు దానిని కొనసాగించేందుకు అవకాశం ఉంది. ఇలా గడువు పెంచుకుంటూ దాటిన సొమ్ముపై లాభాలను కొనసాగించుకోవచ్చు.

5. అధిక రిస్క్ పెట్టుబడిదారులు తమ పెట్టుబడి పోర్ట్‌ఫోలియో పెట్టుబడులలో కొంత భాగాన్ని పీపీఎఫ్ కింద దాచుకోవచ్చు. పెట్టుబడి దీర్ఘకాలిక లక్ష్యం కోసం అయితే.. PPF ఒక గొప్ప ఎంపిక ఎందుకంటే ఇది పోర్ట్‌ఫోలియో డెట్ పోర్షన్‌లో కావలసిన స్థిరత్వాన్ని ఇస్తూ అనుకున్న రాబడిని అందిస్తాయి. ఇది దీర్ఘకాలంలో ఈక్విటీ భాగం యొక్క ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడంలో వారికి సహాయకారిగా నిలుస్తుంది.

6. అత్యధిక ఆదాయపు పన్ను పరిధిలో ఉన్న చాలా మంది పన్ను చెల్లింపుదారులకు సెక్షన్ 80C ప్రయోజనం ఉండకపోవచ్చు. ఎందుకంటే.. పన్ను రాయితీ పొందడానికి వారికి EPF, పిల్లల విద్యా రుసుము, హోమ్ లోన్ , టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం మొదలైన ఇతర మార్గాలు ఉన్నాయి. అయితే.. పన్ను మినహాయింపు అనే అంశం PPF లపై పెట్టుబడి పెట్టేందుకు చాలా ఆకర్షణీయమైన ఎంపికగా చేస్తాయి. ప్రత్యేకించి ఆదాయం 30% లేదా అంతకంటే ఎక్కువ పన్ను విధించబడినప్పుడు. PFFతో, పూర్తిగా పన్ను రహిత కార్పస్‌ను నిర్మించవచ్చు.

ఇవీ చదవండి..

Virgin Galactic: అంతరిక్షయానానికి టికెట్లు అమ్ముతున్న వర్జిన్ గెలాక్టిక్.. ఒక్కో టికెట్ రేటు ఎంతంటే..

Gold Auction: రూ. 2800 కోట్ల విలువైన బంగారాన్ని అమ్మేసిన కంపెనీ.. కారణమేంటంటే..