Virgin Galactic: అంతరిక్షయానానికి టికెట్లు అమ్ముతున్న వర్జిన్ గెలాక్టిక్.. ఒక్కో టికెట్ రేటు ఎంతంటే..

Virgin Galactic: అంతరిక్షంలోకి ప్రయాణించాలనేవారి కోసం అమెరికాకు చెందిన వర్జిన గెలాక్టిక్ సంస్థ టికెట్లను అమ్మడం ప్రారంభించింది. ఈ సంవత్సరం ఎక్కువ సంఖ్యలో కమర్షియల్ ఫ్లైట్లను నడిపేందుకు సంస్థ..

Virgin Galactic: అంతరిక్షయానానికి టికెట్లు అమ్ముతున్న వర్జిన్ గెలాక్టిక్.. ఒక్కో టికెట్ రేటు ఎంతంటే..
Virgin Galactic
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Feb 17, 2022 | 10:41 AM

Virgin Galactic: అంతరిక్షంలోకి ప్రయాణించాలనేవారి కోసం అమెరికాకు చెందిన వర్జిన గెలాక్టిక్ సంస్థ టికెట్లను అమ్మడం ప్రారంభించింది. ఈ సంవత్సరం ఎక్కువ సంఖ్యలో కమర్షియల్ ఫ్లైట్లను నడపాలని నిర్ణయించినట్లు సంస్థ తాజాగా వెల్లడించింది. ఒక్కో టికెట్ ధరను 4.5 లక్షల డాలర్లు (సుమారు రూ. 3.37 కోట్లు) గా నిర్ణయించింది. ఇందుకోసం టికెట్ కావాలనుకున్న వారు ముందుగా 1.5 లక్షల డాలర్లను డిపాజిట్ చేయాలని.. మిగిలిన మెుత్తాన్ని ప్రయాణానికి ముందు చెల్లించవచ్చవి వర్జిన్ గెలాక్టిక్ స్పష్టం చేసింది. ఈ ప్రయాణం కోసం టికెట్ కొనుకున్న వారికి ఫ్యూచర్ ఆస్ట్రోనాట్ కమ్యూనిటీకి ఆహ్వానం లభిస్తుందని సంస్థ వెల్లడించింది. ఇలా టికెట్ కొనుక్కునే వారికి డబ్బు ఖర్చు చేసినా అనుమతి లేని కొన్ని ప్రత్యేక ఈవెంట్లకు, ట్రిప్పులకు, యాక్టివిటీలకు అవకాశం ఉంటుందని పేర్కొంది. ఈ సంవత్సరం చివరి నాటికి 1000 మంది ప్రయాణికులను స్పేస్ లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సంస్థ సీఈవో మైఖెల్ కాల్ గ్లాజియెర్(Michael Colglazier) వెల్లడించారు.

ఇలా టికెట్ బుక్ చేసుకునే టూరిస్టులకు న్యూ మెక్సికో, యూఎస్ఏ లోని స్పేస్ పోర్ట్ అమెరికా హోటల్ లో కొన్ని రోజుల పాటు విడిధి ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ విడిధి టూర్ కు ముందు మాత్రమే అందిస్తున్నట్లు తెలిపింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ లో మెుదటి స్పెస్ ఫ్లైట్ టూర్ ఉంటుందని వెల్లడించింది. ఈ ప్రయాణం సుమారు గంటన్నర పాటు కొనసాగుతుందని వెల్లడించింది. ఈ సమయంలో కొన్ని నిమిషాల పాటు ప్రయాణికులు వెయిట్ లెస్ నెస్ స్థితిని అనుభూతి చెందుతారని వర్జిన్ గెలాక్టిక్ వెల్లడించింది. సంస్థ కమర్టియల్ ప్రయాణాలను సిద్ధం అవుతోందనే వార్తతో కంపెనీ షేర్లు ఒక్కసారిగా పెరిగాయి. అమెరికా స్టాక్ మార్కెట్ లో షేర్ల ధర 30 శాతం మేర పెరిగింది. గడచిన సంవత్సర కాలంలో షేర్ ధర 80 శాతం వరకు పడిపోయిందని తెలుస్తోంది.

కంపెనీ దాని పాత లోగోను మార్చినట్లు ప్రకటించింది. కంపెనీ వ్యవస్థాపకుడు బ్రాన్సన్ గత మూడేళ్ల కాలంలో 1.25 బిలియన్ డాలర్ల స్టాక్‌ను విక్రయించిన తర్వాత ఈ వార్త వెలువడింది. గత జూలైలో వర్జిన్ గెలాక్టిక్ పూర్తి సిబ్బందితో కూడిన అంతరిక్షయానంలో ప్రయాణించిన ఆరుగురిలో బిలియనీర్ కూడా ఒకరిగా ఉన్నారు.

ఇవీ చదవండి..

Gold Auction: రూ. 2800 కోట్ల విలువైన బంగారాన్ని అమ్మేసిన కంపెనీ.. కారణమేంటంటే..

FD Interest rate: ఎస్‌బీఐ తర్వాత హెచ్‌డీఎఫ్ఎసీ బ్యాంక్ కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచింది.. ఇప్పుడు మీరు ఎఫ్డీపై మరింత ప్రయోజనం పొందవచ్చు..