American Woman: వైద్య చరిత్రలో మరో అద్భుతం.. స్టెమ్‌ సెల్స్‌తో.. ఎయిడ్స్‌ పూర్తిగా నయం..

Miracle in Medical History: గత కొన్ని ఏళ్లుగా మానవులను భయపెడుతున్న ప్రాణాంతక వ్యాధిని నయం చేసి.. వైద్య చరిత్రలో మరో అద్భుతాన్ని సృష్టించారు వైద్య బృందం. తొలిసారి ఒక మహిళకు ఎయిడ్స్‌(Aids) పూర్తిగా..

American Woman: వైద్య చరిత్రలో మరో అద్భుతం.. స్టెమ్‌ సెల్స్‌తో.. ఎయిడ్స్‌ పూర్తిగా నయం..
Hiv
Follow us
Surya Kala

|

Updated on: Feb 17, 2022 | 3:51 PM

Miracle in Medical History: గత కొన్ని ఏళ్లుగా మానవులను భయపెడుతున్న ప్రాణాంతక వ్యాధిని నయం చేసి.. వైద్య చరిత్రలో మరో అద్భుతాన్ని సృష్టించారు వైద్య బృందం. తొలిసారి ఒక మహిళకు ఎయిడ్స్‌(Aids) పూర్తిగా నయమైంది. మూలకణ మార్పిడి(stem cell transplant) చికిత్సతో ఓ మహిళ సంపూర్ణంగా ఎయిడ్స్‌ కారక హెచ్‌ఐవీ వైరస్‌ నుంచి విముక్తి పొందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో మానవ చరిత్రలో ఎయిడ్స్‌ సంపూర్ణంగా నయమైన మూడో పేషెంట్‌గా, తొలి మహిళా పేషెంట్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. గతంలో ‘బెర్లిన్‌ పేషెంట్‌’గా పిలిచే టిమోతీ రే బ్రౌన్‌ అనే అతనికి 12 ఏళ్ల పాటు హెచ్‌ఐవీ రెమిషన్‌ పొందాడు. అనంతరం ‘లండన్‌ పేషెంట్‌’ అనే ఆడమ్‌ కాసిల్జో అనే వ్యక్తి 30 నెలల నుంచి హెచ్‌ఐవీ రెమిషన్‌లో ఉన్నాడు. వీరి తర్వాత ప్రస్తుత మహిళా పేషెంటే హెచ్‌ఐవీ రెమిషన్‌ లేదా ఎయిడ్స్‌ నుంచి పూర్తిగా ఉపశమనం పొందింది. ఈ కేసు వివరాలను పరిశోధకులు యూఎస్‌లో ఫిబ్రవరి 15న జరిగిన సీఆర్‌ఓఐ సదస్సులో వెల్లడించారు. స్టెమ్‌ సెల్‌ మార్పిడి అనంతరం ఆమె 14 నెలలుగా యాంటీ వైరల్‌ థెరపీ తీసుకోవడం లేదని, అయినా ఆమెలో హెచ్‌ఐవీ వైరస్‌ కనిపించలేదని వివరించారు.

బొడ్డుపేగు నుంచి తీసిన స్టెమ్‌ సెల్స్‌తో హెచ్‌ఐవీ రెమిషన్‌ సాధ్యమైందని పరిశోధకులు తెలిపారు. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, జాన్స్‌హాప్‌కిన్స్‌ యూనివర్సిటీలకు చెందిన రిసెర్చర్లు ఐఎంపీఏఏసీటీ పీ1107 ఆధ్వర్యంలో ఈ రీసెర్చ్‌ చేశారు. 2015లో ప్రారంభించిన ఈ నెట్‌వర్క్‌ హెచ్‌ఐవీ సోకిన 25మంది పేషెంట్లపై పరిశోధనలు చేసి ఫలితాలు నమోదు చేసింది.

ప్రస్తుత ప్రయోగంలో హెచ్‌ఐవీని జయించిన మహిళ మైలాయిడ్‌ ల్యుకేమియా తో బాధపడుతోంది. ఇదే సమయంలో హెచ్‌ఐవీ సోకడంతో నాలుగేళ్లుగా ఏఆర్‌టీ తీసుకుంటోంది. కాగా 2017లో ఆమె మూలకణాలతో బ్లడ్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకుంది. అది పూర్తైన 37 నెలలకు ఆమె ఏఆర్‌టీ కూడా నిలిపివేసింది. అప్ప టి నుంచి ఇప్పటికి 14 నెలలు గడిచిందని, ప్రస్తు తం ఆమెలో ట్రేసబుల్‌ వైరస్‌ లేదని పరిశోధకులు తెలిపారు. అయితే స్టెమ్‌సెల్‌ బ్లడ్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చికిత్స ఖరీదైనది. ఈ చికిత్స వల్ల సైడ్‌ ఎఫెక్టులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా దాత ఇమ్యూనిటీ కణాలు, గ్రహీత ఇమ్యూనిటీ కణాలపై దాడి చేయడం అతిపెద్ద సమస్య. తొలి రెండు చికిత్సల్లో ఈ సమస్య ఎదురైంది. కానీ ఈసారి మహిళా పేషెంటులో ఈ సమస్య కనిపించలేదు. దీంతో మరోమారు ఎయిడ్స్‌కు సంపూర్ణ చికిత్సపై ఆశలు పెరిగాయి.

Also Read:  ప్రెగ్నెంట్ అని కుక్కకి ఎక్స్‌రే.. వైద్యులు షాక్..సర్జరీకి లక్షలు ఖర్చు చేసిన యజమాని