Dog Pregnant: ప్రెగ్నెంట్ అని కుక్కకి ఎక్స్‌రే.. వైద్యులు షాక్..సర్జరీకి లక్షలు ఖర్చు చేసిన యజమాని..
Dog Pregnant: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏ విధమైన షాకింగ్ విషయాలు జరిగినా వెలుగులోకి వస్తున్నాయి. అయితే కొన్ని వెంటనే తెరపైకి రాగా.. మరికొన్ని ఆలస్యంగా..
Dog Pregnant: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏ విధమైన షాకింగ్ విషయాలు జరిగినా వెలుగులోకి వస్తున్నాయి. అయితే కొన్ని వెంటనే తెరపైకి రాగా.. మరికొన్ని ఆలస్యంగా వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా గత ఏడాది చివరిలో జరిగిన ఓ విచిత్ర సంఘటన ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఈ షాకింగ్ న్యూస్ కుక్కకు సంబంధించినది. ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క గర్భవతి అయినట్లు భావించాడు. నిజానికి, అకస్మాత్తుగా కుక్క కడుపు ఉబ్బింది.. ఆ వ్యక్తి కుక్క గర్భాన్ని ఒక అద్భుతంగా భావించాడు. వాంతులు చేసుకుంటూ చాలా నీరసంగా తయారైంది. దీంతో కుక్క యజమాని తన కుక్కని డాక్టర్ వద్దకు తీసుకెళ్లగా.. అక్కడి వైద్యులు కుక్కకి ఎక్స్‌రే తీసిన వైద్యులు రిపోర్ట్ చూసి షాకయ్యారు. ఈ వింత ఘటన యూకేలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
యూకేకి చెందిన నీల్ టేలర్ అనే వ్యక్తి తన పెంపుడు కుక్క ఆల్ఫీ కొన్ని రోజులుగా వాంతులు చేసుకుంటూ నీరసంగా ఉండటంతో. కుక్క కడుపుతో ఉందనుకుని ఆనందంగా వెటర్నరీ ప్రాక్టీస్ క్లినిక్‌కి తీసుకెళ్లాడు. అయితే అక్కడ డాక్టర్లు ఆ కుక్కని పరీక్షించి ఎక్క్‌రే తీశారు. ఎక్స్‌రే చూసి ఖంగుతిన్న వైద్యులు అసలు విషయం నీల్‌కి వివరించారు. కుక్క కడుపులో చాలా గోల్ఫ్ బంతులు ఉన్నాయని చెప్పారు. దీంతో ఆ కుక్కకి వైద్యులు సర్జరీ చేసి ఏకంగా 25 గోల్ఫ్ బంతులను కడుపులోంచి తీశారు. ఇన్ని గోల్ఫ్ బంతులు కుక్క కడుపులోకి ఎలా వచ్చాయో తెలియదని టేలర్ చెప్పాడు. అయితే కొద్ది రోజుల క్రితం నీల్ టేలర్.. తన కుక్కతో కలిసి గోల్ఫ్ కోర్టుకు వెళ్లినట్లు చెప్పాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆల్ఫీ పరిస్థితి విషమించడం ప్రారంభించిందని, ఆకస్మాత్తుగా ఆల్ఫీకి వాంతులు అవ్వడం, నీరసంగా మారిపోవడం జరిగిందని వాపోయాడు. కానీ ఆల్ఫీ ఇన్ని బంతులు మింగినట్లు తాను గమనించలేదని చెప్పుకొచ్చాడు. అయితే నీల్‌కి ఆ ఆసుపత్రి సర్జరీ కోసం సుమారు 2 లక్షల 37 వేల బిల్లు వేశారు. నీల్ మాత్రం తన కుక్క ప్రాణాలతో సురక్షితంగా ఉన్నందుకు ఆనందంగా ఉందన్నాడు.
Also Read: