Ram Charan: రామ్ చరణ్ సినిమాకు భారీ బిజినెస్.. హిందీ రైట్స్ ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను లైన్ లోపెడుతున్నారు. జక్కన తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్న చరణ్

Ram Charan: రామ్ చరణ్ సినిమాకు భారీ బిజినెస్.. హిందీ రైట్స్ ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందే..
Rc 15
Follow us

|

Updated on: Feb 17, 2022 | 3:28 PM

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను లైన్ లోపెడుతున్నారు. జక్కన తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్‌లోకి అడుగుపెడుతున్న చరణ్.. ఆ తర్వాత కూడా ఎక్కువ పాన్ ఇండియా సినిమాలనే కమిట్ అవ్వాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ సినిమా టాప్ డైరెక్టర్ శంకర్ తో చేస్తున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయ్యిందని తెలుస్తుంది. రామ్ చరణ్ కెరీర్ లో 15 మూవీగా రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. గతంలో ఈ ఇద్దరు కలిసి వినయ విధేయ రామ అనే సినిమా చేస్తారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకొలేకపోయింది. ఇక ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు కొందరు. అలాగే ఈ సినిమాలో చరణ్ సీఎం గా కనిపిస్తారని కూడా టాక్ వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఇక మూవీకి సంబంధించిన బిజినెస్ పెద్ద ఎత్తున జరుగుతోంది. షూటింగ్ జరుపుకుంటుండగానే  కార్పోరేట్ కంపెనీలు ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం పెద్ద ఎత్తున పోటీపడుతున్నాయి. ఇప్పటికే హిందీ రైట్స్ ని జీ స్టూడియోస్ దక్కించుకుంది. హిందీ థియేట్రికల్ రైట్స్ సహా శాటిలైట్.. డిజిటల్ హక్కుల్ని జీ స్టూడియోస్ చేజిక్కించుకుందని టాక్ వినిపిస్తుంది. దాదాపు 350 కోట్లు ఖర్చు చేసి  హిందీ రైట్స్ ను దక్కించుకున్నారట. ప్రస్తుతం రాజమండ్రిలో ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. జూన్ నెలాఖరకు షూటింగ్ మొత్రం పూర్తవుతుందని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sreemukhi: మెస్మరైజ్ చేస్తున్న శ్రీముఖి లేటెస్ట్ ఫోటోస్.. ఆమె అందానికి ఫిదా అవ్వాల్సిందే

ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్స్ ధరలపై కమిటీ కీలక నిర్ణయం.. వారం రోజుల్లోనే ప్రభుత్వం నుంచి..

Priyamani: పరువాలతో మైమరిపిస్తున్న ప్రియమణి లేటెస్ట్ శారీ పిక్స్ వైరల్

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ