Pan India Star Prabhas: ప్రభాస్- మారుతి సినిమా నుంచి త్వరలోనే బిగ్ అప్డేట్..?

బాహుబలి సినిమాతర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది.. అప్పటివరకు తెలుగు రాష్ట్రలవరకే పరిమితం అయిన ప్రభాస్ క్రేజ్ బాహుబలి సినిమ తర్వాత దేశాలు దాటి పోయింది.

Pan India Star Prabhas: ప్రభాస్- మారుతి సినిమా నుంచి త్వరలోనే బిగ్ అప్డేట్..?
Prabhas
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 17, 2022 | 4:03 PM

Pan India star Prabhas: బాహుబలి సినిమాతర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది.. అప్పటివరకు తెలుగు రాష్ట్రలవరకే పరిమితం అయిన ప్రభాస్ క్రేజ్ బాహుబలి సినిమ తర్వాత దేశాలు దాటిపోయింది. ఏకంగా చైనా నుంచి కూడా ప్రభాస్‌ను చూడటానికి అక్కడి ఫ్యాన్స్ ఇక్కడికి వస్తున్నారంటే అర్ధం చేసుకోవచ్చు డార్లింగ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందొ. ఇక సాహో సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యి భారీ వసూళ్లను అందుకుంది. ముఖ్యంగా హిందీలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ప్రభాస్ అన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌నే లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం రాధా కృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా చేస్తున్నారు ప్రభాస్ ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ప్రియాడికల్ లవ్ డ్రామాగా ఈ సినిమా ఉండనుంది.

ఈ సినిమా తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అలాగే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. వీటితో పాటు సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమాను కమిట్ అయ్యాడు డార్లింగ్. వీటన్నిటితోపాటు మారుతి డైరెక్షన్ లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రభాస్. ఈ సినిమా హారర్ కామెడీ జోనర్ లో ఈ సినిమా రూపొందనుందని టాక్. ఈ మూవీకి ‘రాజా డీలక్స్’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌ను కూడా రిజిస్టర్ చేయించారని తెలుస్తుంది. అయితే  త్వరలోనే ఈ సినిమా అనౌన్స్ మెంట్ రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sreemukhi: మెస్మరైజ్ చేస్తున్న శ్రీముఖి లేటెస్ట్ ఫోటోస్.. ఆమె అందానికి ఫిదా అవ్వాల్సిందే

ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్స్ ధరలపై కమిటీ కీలక నిర్ణయం.. వారం రోజుల్లోనే ప్రభుత్వం నుంచి..

Priyamani: పరువాలతో మైమరిపిస్తున్న ప్రియమణి లేటెస్ట్ శారీ పిక్స్ వైరల్