Viral Video: లక్ అంటే ఇతనిదే.. చికెన్ కోసం వెళ్లి.. లక్షలతో తిరిగొచ్చాడు ఈ గ్యాప్‌లో ఏం జరిగిందో తెలిస్తే షాకవుతారు..
నిజంగా అదృష్టం ఎవర్ని ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పలేం.. అందుకు ఈ సంఘటనే ఉదాహరణ... చికెన్ తీసుకొద్దామని షాపుకెళ్లి... లక్షల రూపాయలతో తిరిగొచ్చాడు... మరి అదృష్టం కాక ఇంకేమంటారు..? ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 75 లక్షల జాక్‌పాట్ కొట్టేశాడు. అవును మీరు వినేది నిజంగా నిజం.
నిజంగా అదృష్టం ఎవర్ని ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పలేం.. అందుకు ఈ సంఘటనే ఉదాహరణ… చికెన్ తీసుకొద్దామని షాపుకెళ్లి… లక్షల రూపాయలతో తిరిగొచ్చాడు… మరి అదృష్టం కాక ఇంకేమంటారు..? ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 75 లక్షల జాక్‌పాట్ కొట్టేశాడు. అవును మీరు వినేది నిజంగా నిజం. అమెరికా మేరిల్యాండ్‌లోని హాగర్స్‌టౌన్‌లో నివసిస్తున్న 52 ఏళ్ల వ్యక్తిని తన భార్య చికెన్ తీసుకురమ్మని చికెన్ సెంటర్‌కు పంపింది. అయితే, దారిలో తన లక్‌ను పరీక్షించుకుందాం అనిపించి ఆ వ్యక్తి ఒక లాటరీ టికెట్‌ను కొన్నాడు. నిజంగా అతను కొన్న టైమో.. లేక అతని అదృష్టమో కానీ అతనికి ఏకంగా 1 లక్షల డాలర్ల జాక్‌పాట్ తగిలింది. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 75 లక్షల రూపాయలు. ఈ వ్యక్తి లాటరీ వెండింగ్ మెషీన్ నుంచి స్క్రాచ్ ఆఫ్ లాటరీ టికెన్‌ను 10 డాలర్లు అంటే 748 రూపాయలు పెట్టి కొన్నాడు. తర్వాత ఇంటికి వచ్చి డిన్నర్ చేసిన తరువాత తీరిగ్గా.. తాను కొన్న లాటరీ టికెట్‌ను స్క్రాచ్ చేశాడు. అంతే.. లక్ష డాలర్లు గెలుచుకున్నట్లు కనిపించింది. అంతమొత్తం డబ్బు గెలుచుకోవడంతో ఆ వ్యక్తి కుటుంబం సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోయింది. ఒక్క రోజులో తన జీవితం హఠాత్తుగా ఇలా మలుపు తిరుగుతుందని తాను అనుకోలేదంటూ సంతోషం వ్యక్తం చేశాడు ఆ లక్కీ పర్సన్. తాను గెలిచిన డబ్బును అప్పు తీర్చడానికి, కుటుంబానికి ఉపయోగిస్తానని చెప్పాడు . ఇల్లు కట్టుకుంటానని, కొత్త టీవీని కొనుగోలు చేస్తానని, టూర్ వెళ్తానని సంతోషంలో తన కోరికలన్నీ చెప్పేసాడు ఆ లక్కీ మ్యాన్.
మరిన్ని చూడండి ఇక్కడ:
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

