Petrol Diesel Price: రష్యా-ఉక్రెయిన్ రచ్చ కారణంగా పెరిగిన ముడి చమురు ధరలు.. మన దేశంలో మాత్రం పెట్రోల్-డీజిల్ ధరలు ఇలా..

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. అమెరికా, పాకిస్థాన్ సహా పలు దేశాల్లో పెట్రోల్ ధరలు మంటలు పుట్టిస్తున్నాయి.

Petrol Diesel Price: రష్యా-ఉక్రెయిన్ రచ్చ కారణంగా పెరిగిన ముడి చమురు ధరలు.. మన దేశంలో మాత్రం పెట్రోల్-డీజిల్ ధరలు ఇలా..
representative image
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 18, 2022 | 8:57 AM

Petrol-Diesel Rates Today: రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. అమెరికా, పాకిస్థాన్ సహా పలు దేశాల్లో పెట్రోల్ ధరలు మంటలు పుట్టిస్తున్నాయి. కానీ భారతదేశంలో నవంబర్ 2021 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలో ఎటువంటి హెచ్చుతగ్గులు లేవు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవని చెబుతున్నారు. అయితే మార్చిలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. నవంబర్ 2021 వరకు దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉంటాయి. అయితే నవంబర్ 3న కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుకగా పెట్రోల్-డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని 10 రూపాయలు తగ్గించడంతో పాటు, ఇంధన ధరలు తగ్గడం వాహనదారులకు కాస్త ఊపిరి పీల్చుకుంది. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ టారిఫ్‌లను తగ్గిస్తున్నట్లే, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధనాలపై వ్యాట్‌ను కూడా తగ్గించాయి. తద్వారా మహానగరంలో అప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అయినా కూడా దేశంలోని 25 ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధర రూ.100 పైనే ఉంది.

ఇదిలావుంటే.. ఐఓసీఎల్ శుక్రవారం దేశంలో ఇంధన చమురు ధరను ప్రకటించింది. నేటికీ ఇంధన చమురు ధరలో ఎలాంటి మార్పు లేదు. దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు 107 రోజులుగా స్థిరంగా ఉన్నాయి. అయితే.. చమురు ధరలు స్థిరంగా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వ్యత్యాసాలున్నాయి. ఇండియన్ ఆయిల్ (IOCL) పెట్రోల్, డీజిల్ కొత్త రేట్లను తాజాగా విడుదల చేసింది. మెట్రో నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉండగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని చాలా చోట్ల ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఈ వివరాలను వెబ్ సైట్  అందించిన సమాచారం ప్రకారం మీ కోసం..

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.57గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.95గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.55గా ఉండగా.. డీజిల్ ధర రూ.94.93గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.37గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.71గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20 ఉండగా.. డీజిల్ ధర రూ.95.01గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.69 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.35కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.44లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.05 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.18గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.36 లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.96.40గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.59గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.66గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.110.35లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.44లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.95.41 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 86.67 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 89.79 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.40 ఉండగా.. డీజిల్ ధర రూ.91.43గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.58 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.85.01గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.33 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.86.85గా ఉంది.

ఇవి కూడా చదవండి: Medaram Jathara 2022: నేడు మేడారానికి సీఎం కేసీఆర్‌.. కుటుంబ సమేతంగా అమ్మవార్లను దర్శించుకోనున్న ముఖ్యమంత్రి..

Singapore PM: సింగపూర్ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు.. భారత్ తీవ్ర అభ్యంతరం.. రాయబారికి సమన్లు..