RBI: మొండి రుణ అకౌంట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. అలా చేస్తేనే స్టాండర్డ్‌ ఖాతాగా మారవచ్చు..!

RBI: బ్యాంకింగ్‌ రంగంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇక మొండి బకాయిల విషయంలో కూడా నిర్ణయం తీసుకుంది...

RBI: మొండి రుణ అకౌంట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. అలా చేస్తేనే స్టాండర్డ్‌ ఖాతాగా మారవచ్చు..!
Follow us

|

Updated on: Feb 18, 2022 | 8:12 AM

RBI: బ్యాంకింగ్‌ రంగంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇక మొండి బకాయిల విషయంలో కూడా నిర్ణయం తీసుకుంది. రుణ ఖాతాను స్టాండర్డ్‌ అకౌంట్‌గా మార్చే విషయంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను అమలు గడువును 2022 సెప్టెంబర్‌ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరంలో ఈ మార్గదర్శకాలను బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్బీఐ ప్రకటించింది. వీటి అమలుకు గత ఏడాది డిసెంబర్‌ 31 వరకు గడువును పొడిగించింది. ఎన్‌బీఎఫ్‌సీలు చేసిన అభ్యర్థన మేరకు ఈ ఏడాది సెప్టెంబర్‌ వరకు పొడిగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అయితే ఈ మార్గదర్శకాల కింద బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు (NBFC), ఎన్‌పీఏ (NPA)లుగా గుర్తించిన ఏదైనా అకౌంట్‌ను సకాలంలో చెల్లింపులు చేసే అకౌంట్‌గా మారవచ్చు. ఎన్‌పీఏ ఖాతాదారుడు పూర్తి రుణం, వడ్డీ చెల్లింపులు చేసినట్లయితే ఇలా చేయడానికి అనుమతి ఇస్తుంది.

వడ్డీ, అసలు బకాయి చెల్లించిన వాటికే..

కాగా, కొన్ని బ్యాంకులు ఎన్‌బీఎఫ్‌సీలు ఎన్‌పీఏ ఖాతాలను కేవలం వడ్డీ చెల్లింపులు చేసిన వెంటనే స్టాండర్డ్‌గా మారుస్తున్నట్లు ఆర్బీఐ దృష్టికి వచ్చింది. దీంతో కేవలం వడ్డీ కాకుండా అసలు రుణ బకాయిలు చెల్లించిన వాటినే అప్‌గ్రేడ్‌ చేయాల్సి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి:

PF Account Holders: PF ఖాతాదారులకు EPFO ​హెచ్చరిక.. ఇలా చేస్తే అకౌంట్ ఖాళీ..!

Kisan Credit Card Loan: రైతులు కిసాన్‌ క్రెడిట్‌ కార్డు రుణం ఆలస్యంగా చెల్లిస్తున్నారా..? ఇబ్బందులే..!

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..