Kisan Credit Card Loan: రైతులు కిసాన్‌ క్రెడిట్‌ కార్డు రుణం ఆలస్యంగా చెల్లిస్తున్నారా..? ఇబ్బందులే..!

Kisan Credit Card Loan: క్రెడిట్ కార్డు రైతులకు ఎంతో మేలు చేస్తుంది. దేశంలోని రైతులు వ్యవసాయం కోసం ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని, సరైన..

Kisan Credit Card Loan: రైతులు కిసాన్‌ క్రెడిట్‌ కార్డు రుణం ఆలస్యంగా చెల్లిస్తున్నారా..? ఇబ్బందులే..!
Follow us

|

Updated on: Feb 18, 2022 | 6:46 AM

Kisan Credit Card Loan: క్రెడిట్ కార్డు రైతులకు ఎంతో మేలు చేస్తుంది. దేశంలోని రైతులు వ్యవసాయం కోసం ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని, సరైన సమయంలో వ్యవసాయానికి డబ్బు పొందేలా కిసాన్ క్రెడిట్ కార్డ్ ప్రారంభించబడింది కేంద్ర ప్రభుత్వం. ఈ కార్డుదారులు తమ ఖాతాను ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేయలేని రైతులు వారికి సబ్సిడీ ప్రయోజనం లభించదు. రుణంపై వడ్డీతో పాటు జరిమానా విధించే బ్యాంకులు చాలా ఉన్నాయి. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ఖాతాపై వడ్డీ రేటు ఏడు శాతానికి బదులుగా తొమ్మిది శాతం వరకు వసూలు చేయబడుతుంది. అంతేకాకుండా ఈ వడ్డీ రేటు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. కొన్ని సందర్భాల్లో బ్యాంకులలో, వడ్డీ రేటు మూడేళ్ల తర్వాత 14 శాతానికి చేరుకుంటుంది.

కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణాన్ని ఎల్లప్పుడూ సరైన సమయంలో కట్టాల్సి ఉంటుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్‌పై, కార్డు హోల్డర్లు రూ.3 లక్షల వరకు ఏడు శాతం చొప్పున వడ్డీని చెల్లించాలి. ఇది ఆరు నెలవారీ ప్రాతిపదికన (మే 31 మరియు నవంబర్ 30 తేదీలలో) ఉంటుంది.. ఇది కాకుండా కార్డ్ హోల్డర్ తన ఖాతాను ఒక ఏడాదిలోపు పునరుద్ధరించుకోవాలి. పునరుద్ధరణపై, 3 శాతం వడ్డీ సబ్సిడీగా తిరిగి ఇవ్వబడుతుంది. ఈ విధంగా సరైన సమయంలో రుణాలు చెల్లించే రైతులకు నాలుగు శాతం చొప్పున రుణాలు అందుతాయి.

రుణం చెల్లించడంలో తప్పు చేయవద్దు

రైతులు సరైన సమయంలో కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ( KCC) రుణాన్ని చెల్లించడంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. చాలా సందర్భాలలో రాజకీయ నాయకులు రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేస్తుంటారు. దీంతో ఆశతో చాలా మంది రైతులు వడ్డీలు సక్రమంగా చెల్లించరు. దీంతో బ్యాంకులు రైతులపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా బ్యాంకులు ఖాతాదారు నుండి జరిమానా, వడ్డీ, రికవరీ ఖర్చులు, లాగర్ ఛార్జీలతో సహా అనేక ఛార్జీలను వేస్తూ డబ్బు వసూలు చేస్తాయి. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా మొత్తం కిసాన్‌ క్రెడిట్‌ కార్డు (KCC) రుణాన్ని మాఫీ చేయదని నిపుణులు చెబుతున్నారు.

రుణాన్ని సకాలంలో చెల్లించడం వల్ల కలిగే ప్రయోజనాలు

సకాలంలో రుణం చెల్లించిన రైతులకు వడ్డీ మాఫీ ఉంటుంది. సరైన సమయంలో రుణాన్ని చెల్లించని రైతులకు వడ్డీ ఎక్కువగా పడుతుంది. మరోవైపు, ఈ మొత్తానికి బ్యాంక్ తీసుకున్న ఇతర ఛార్జీలు కలిపితే ఎక్కువ మొత్తంలో చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా మీ CIBIL స్కోర్ కూడా పడిపోతుంటుంది. దీని కారణంగా మీరు బ్యాంకు నుండి రుణం తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొవలసి రావచ్చు.

ఇవి కూడా చదవండి:

Amazon Offer: అమెజాన్‌ అదిరిపోయే ఆఫర్‌.. సభ్యత్వంపై 50 శాతం క్యాష్‌బ్యాక్‌.. వారికి మాత్రమే..!

PM KISAN: పీఎం కిసాన్‌ స్కీమ్‌ డబ్బులు భార్యాభర్తలు తీసుకుంటున్నారా..? అయితే ఇబ్బందుల్లో పడినట్లే..!

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే