AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PF Account Holders: PF ఖాతాదారులకు EPFO ​హెచ్చరిక.. ఇలా చేస్తే అకౌంట్ ఖాళీ..!

PF Account Holders: ప్రస్తుతం సైబర్‌ నేరగాళ్లు పెరిగిపోతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా అకౌంట్‌లో ఉన్న డబ్బులన్ని ఖాళీ చేసేస్తున్నారు. ఖాతాలకు సంబంధించిన పాస్‌వర్డ్‌లు,..

PF Account Holders: PF ఖాతాదారులకు EPFO ​హెచ్చరిక.. ఇలా చేస్తే అకౌంట్ ఖాళీ..!
Subhash Goud
|

Updated on: Feb 18, 2022 | 7:31 AM

Share

PF Account Holders: ప్రస్తుతం సైబర్‌ నేరగాళ్లు పెరిగిపోతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా అకౌంట్‌లో ఉన్న డబ్బులన్ని ఖాళీ చేసేస్తున్నారు. ఖాతాలకు సంబంధించిన పాస్‌వర్డ్‌లు, ఇతర వివరాలు ఇతరులతో పంచుకోకపోవడం మంచిది. ఎవరైనా ఫోన్‌లు చేసి వివరాలు చెప్పవద్దని పోలీసులు హెచ్చరిస్తుంటారు. ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) తన కస్టమర్లను అలర్ట్‌ చేస్తోంది. పీఎఫ్ అకౌంట్‌కు సంబంధించి యూఏఎన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌, ఇతర వివరాలు సోషల్‌ మీడియాలో పంచుకోవద్దని సూచించింది. పీఎఫ్‌ సంస్థ కూడా కస్టమర్లకు ఫోన్‌లు చేసి అకౌంట్‌కు సంబంధించిన వివరాలు అడగదని స్పష్టం చేసింది. పొరపాటున వివరాలు సోషల్‌ మీడియాలో గానీ, ఇతరులతో పంచుకున్నట్లయితే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

వివరాలు తెలిపిన క్షణాల్లోనే మీ ఖాతా మొత్తం ఖాళీ అయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈపీఎఫ్‌ఓ మీ ఆధార్‌, పాన్‌, యూఏఎన్‌, బ్యాంకు వివరాలు అడగదని, ఒక వేళ ఎవరైనా ఫోన్‌ చేసి అడిగినా వివరాలు చెప్పవద్దని సూచించింది. అంతేకాకుండా మోసపూరితమైన కాల్స్‌కు స్పందించవద్దని ట్విట్టర్‌ ద్వారా హెచ్చరిస్తోంది. ఈపీఎఫ్‌ఓ మీ వ్యక్తిగత వివరాలతో పాటు సోషల్‌ మీడియా ద్వారా డబ్బులు డిపాజిట్‌ చేయాలని కూడా కోరదని తెలిపింది. ఇప్పటికే ఇలా మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పోలీసులు సైతం ప్రత్యేక నిఘా పెట్టారు. ఇలాంటివి మోసాలు జరగకుండా కస్టమర్లను అప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Kisan Credit Card Loan: రైతులు కిసాన్‌ క్రెడిట్‌ కార్డు రుణం ఆలస్యంగా చెల్లిస్తున్నారా..? ఇబ్బందులే..!

LIC Policyholders: ఎల్‌ఐసీ పాలసీదారులకు అలర్ట్‌.. ఫిబ్రవరి 28లోగా ఆ వివరాలు అప్‌డేట్‌ చేసుకోండి..!