Stock Market: 10 నిమిషాల్లో రూ. 186 కోట్లు ఆర్జించిన బిగ్ బుల్‌.. రాకేష్ జున్‌జున్‌వాలాకు కోట్లు తెచ్చిన ఆ స్టాక్స్‌ ఏమిటంటే..

వరుసగా రెండు సెషన్లలో తీవ్రనష్టం జరిగిన తర్వాత, సెన్సెక్స్, నిఫ్టీ ఎట్టకేలకు ఈరోజు గ్రీన్ జోన్‌లో వెళ్లాయి...

Stock Market: 10 నిమిషాల్లో రూ. 186 కోట్లు ఆర్జించిన బిగ్ బుల్‌.. రాకేష్ జున్‌జున్‌వాలాకు కోట్లు తెచ్చిన ఆ స్టాక్స్‌ ఏమిటంటే..
Jhunjhunwala
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 16, 2022 | 7:00 AM

వరుసగా రెండు సెషన్లలో తీవ్రనష్టం జరిగిన తర్వాత, సెన్సెక్స్, నిఫ్టీ ఎట్టకేలకు ఈరోజు గ్రీన్ జోన్‌లో వెళ్లాయి. భారతీయ స్టాక్ మార్కెట్(Stock Market) ఈ సానుకూల ఓపెనింగ్‌లో, ఏస్ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా(Rakesh Jhunjhunwala) తన రెండు పోర్ట్‌ఫోలియో స్టాక్‌లు పెరిగిన తర్వాత మార్కెట్ ప్రారంభమైన 10 నిమిషాల్లోనే అతని నికర విలువ రూ.186 కోట్లు పెరిగింది. రాకేష్ జున్‌జున్‌వాలా పోర్ట్‌ఫోలియోలోని టైటాన్ కంపెనీ, టాటా మోటార్స్(tata motors) షేర్లు భారీగా పెరగడమే ఇందుకు కారణం.

సోమవారం టైటాన్ షేరు ధర NSEలో రూ.2398 వద్ద ముగిసింది. మంగళవారం స్టాక్ మార్కెట్ ప్రారంభమైన 10 నిమిషాల్లోనే ఒక్కో షేరు మునుపటి ముగింపుతో పోలిస్తే రూ.37 పెరిగింది. అదేవిధంగా సోమవారం ఓపెనింగ్ బెల్‌లో రాకేష్ జున్‌జున్‌వాలా హోల్డింగ్ కంపెనీ స్టాక్ టాటా మోటార్స్ షేర్లు రూ. 471.45 వద్ద ముగిశాయి. కానీ మంగళ వారం మార్కెట్ మొదలైన 10 నిమిషాల్లో రూ.4.80 పెరిగి చివరికి టాటా మోటర్స్ స్టాక్ రూ. రూ. 32 పెరిగి రూ.503 వద్ద ముగిసింది.

టైటాన్ కంపెనీలో రాకేష్ జున్‌జున్‌వాలా, అతని భార్య రేఖా ఝున్‌జున్‌వాలా కంపెనీలో పెట్టుబడి పెట్టారు. రాకేష్ జున్‌జున్‌వాలా 3,57,10,395 షేర్లు లేదా 4.02 శాతం వాటాను కలిగి ఉండగా, రేఖ జున్‌జున్‌వాలా కంపెనీలో 95,40,575 షేర్లు లేదా 1.07 శాతం వాటాను కలిగి ఉన్నారు. అంటే, రాకేష్ ఝున్‌ఝున్‌వాలా, రేఖా ఝున్‌జున్‌వాలా కలిసి కంపెనీలో 4,52,50,970 షేర్లు లేదా 5.09 శాతం వాటాను కలిగి ఉన్నారు. టాటా మోటార్స్‌లో రాకేశ్ జున్‌జున్‌వాలాకు 3,92,50,000 టాటా మోటార్స్ షేర్లు లేదా కంపెనీలో 1.18 శాతం వాటా ఉన్నట్లు సమాచారం.

టైటాన్ కంపెనీ షేర్ ధర ఈరోజు మార్కెట్ ప్రారంభమైన 10 నిమిషాల్లోనే ఒక్కో షేరుకు ₹37 పెరిగింది. ఈ పెరుగుదల తర్వాత రాకేష్ జున్‌జున్‌వాలా నికర విలువ దాదాపు రూ.167 కోట్లు (రూ.37 x 4,52,50,970) పెరిగింది. అదేవిధంగా, టాటా మోటార్స్ షేర్ ధర ఈరోజు మార్కెట్ ప్రారంభమైన 10 నిమిషాల్లోనే ఒక్కో షేరుకు రూ.4.80 పెరిగింది. ఈ పెరుగుదలతో రాకేష్ జున్‌జున్‌వాలా నికర విలువ దాదాపు రూ.19 కోట్లకు చేరుకుంది. మార్కెట్ ప్రారంభమైన 10 నిమిషాల్లోనే ఈ రెండు టాటా గ్రూప్ స్టాక్‌లు పెరిగిన తర్వాత రాకేష్ జున్‌జున్‌వాలా నికర విలువ రూ186 కోట్లు సంపాదించి పెట్టాయి.

Read Also.. IRCTC Tour Package: ఐఆర్‌సీటీసీ నుంచి మరో టూర్‌ ప్యాకేజీ.. పూర్తి వివరాలు