Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dog v/s Buffello Video: గేదె  v/s కుక్క లాంగ్‌జంప్‌ పోటీ.. విన్నర్‌ ఎవరో తెలుసా..! నెట్టింట వైరల్‌ అవుతున్న సూపర్‌ వీడియో

Dog v/s Buffello Video: గేదె v/s కుక్క లాంగ్‌జంప్‌ పోటీ.. విన్నర్‌ ఎవరో తెలుసా..! నెట్టింట వైరల్‌ అవుతున్న సూపర్‌ వీడియో

Anil kumar poka

|

Updated on: Feb 18, 2022 | 10:50 AM

జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో ప్రతి రోజు వైరల్‌ అవుతుంటాయి. ఇందులో జంతువుల చేష్టలు చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు. అంతేకాదు ఈ వీడియోలను పదే పదే చూస్తూ ఆనందిస్తారు. ఇటీవల ఓ కుక్క, గేదె లాంగ్‌జంప్‌ పోటీకి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.


జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో ప్రతి రోజు వైరల్‌ అవుతుంటాయి. ఇందులో జంతువుల చేష్టలు చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు. అంతేకాదు ఈ వీడియోలను పదే పదే చూస్తూ ఆనందిస్తారు. ఇటీవల ఓ కుక్క, గేదె లాంగ్‌జంప్‌ పోటీకి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో నదిని దాటడానికి కుక్క, గేదె మధ్య పోటీ వచ్చింది. మొదట గేదెకు ఏమి చేయాలో అర్థం కాలేదు కానీ వేగంగా వచ్చి ఒక్క ఉదుటున నదిపై నుంచి జంప్‌ చేసేసింది. కానీ కుక్క నది వరకు వచ్చి భయపడి ఆగిపోయింది. అద్భుతమైనా ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. గేదె చేసిన ఈ భారీ జంప్‌ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారిణి సుధా రామన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. 5 సెకన్ల నిడివి గల ఈ వీడియోను వీక్షిస్తున్న వేలమంది నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కామెంట్ల ద్వారా పలురకాలుగా స్పందిస్తున్నారు. . ‘శక్తి సామర్థ్యాలు ఉంటే అనుకున్న పని విజయవంతమవుతుందని’ ఒక యూజర్‌ అంటే.. మరొక నెటిజన్‌ ‘పట్టుదల ఉండాలే కానీ.. సాధ్యం కానిది ఏదీ ఉండదని’అభిప్రాయపడ్డారు. మరొక యూజర్‌ ఈ వీడియోపై స్పందిస్తూ ‘ఈ గేదె అరేబియా గుర్రం లాంటిది సింపుల్‌గా దూకేసింది’ అంటూ రాసుకొచ్చారు.. మరెందుకాలస్యం.. ఆ వీడియోను మీరూ చూసేయండి.

మరిన్ని చూడండి ఇక్కడ:

Published on: Feb 18, 2022 10:41 AM