Viral Video: ఇక్కడ రెండు పరోటాలు తింటే లక్ష బహుమతి.. విన్నర్‌కి లక్షతో పాటు లైఫ్‌లాంగ్ పరోటా ఫ్రీ..(వీడియో)
మీకు పరోటాలు అంటే చాలా ఇష్టమా.. అయితే మీకో ఛాలెంజ్.. మేం పెట్టే రెండు పరోటాలు తింటే మీకు లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తాం... అంతేకాదు... జీవితాంతం మీకు పరోటా ఫ్రీ గా పెడతాం... ఇది మేం చెప్పట్లేదండి బాబు... జైపూర్‌లోని ఓ రెస్టారెంట్ వాళ్లు చెబుతున్నమాట..
మీకు పరోటాలు అంటే చాలా ఇష్టమా.. అయితే మీకో ఛాలెంజ్.. మేం పెట్టే రెండు పరోటాలు తింటే మీకు లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తాం… అంతేకాదు… జీవితాంతం మీకు పరోటా ఫ్రీ గా పెడతాం… ఇది మేం చెప్పట్లేదండి బాబు… జైపూర్‌లోని ఓ రెస్టారెంట్ వాళ్లు చెబుతున్నమాట.. అసలు విషయం ఏంటంటే… జైపూర్‌లోని న్యూ సంగనేర్ రోడ్‌లో జైపూర్ పరోటా జంక్షన్ పేరుతో ఒక రెస్టారెంట్ నిర్వహిస్తోంది. వీళ్లు కస్టమర్లను ఆకర్షించడానికి ఓ విచిత్రమైన ఆఫర్ పెట్టారు. తమ రెస్టారెంట్‌లో 32 అంగుళాల సైజుగల రెండు పరోటాలను గంటలో తింటే అతనికి లక్ష రూపాయల బహుమతి ఆఫర్ చేశారు. ఇది మాత్రమే కాదు ఈ ఫీట్ సాధించిన వారికి ఇక్కడ జీవితాంతం పరోటా ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. ఈ రెస్టారెంట్‌లో 32-అంగుళాల పరోటా.. 4 వేర్వేరు పరిమాణాలలో దొరుకుతుంది. Zomato వెబ్‌సైట్ ప్రకారం.. జైపూర్ పరోటా రెస్టారెంట్‌లో 72 రకాలకు పైగా 32 అంగుళాల పరోటాలు తయారుచేస్తారు. వీటిలో బంగాళాదుంప, ఉల్లిపాయ, పనీర్‌తో సహా అనేక రకాల పరోటాలు ఉంటాయి. ఇది రెగ్యులర్, మీడియం, లార్జ్, ఎక్స్‌ట్రా లార్జ్ అనే 4 సైజులలో చేస్తారు. పరోటా తినాలనుకునేవారు వారి ఆకలిని బట్టి… వారితోపాటు ఎంత మంది వ్యక్తులు ఉన్నారనే దాని ప్రకారం ఆర్డర్ చేసుకోవచ్చు.ఈ భారీ పరోటాను 5 అడుగుల ప్రత్యేకమైన పాన్‌పైన తయారు చేస్తారు. దీనిని రోలింగ్ చేయడానికి 40 అంగుళాల పొడవైన రోలింగ్‌పిన్ ఉపయోగిస్తారు. ఇక రుచికరమైన ఈ పరోటా తయారీకి 20 రకాల ప్రత్యేకమైన మసాలాలు ఉపయోగిస్తారట. ఈ 32 అంగుళాల పరోటా కోసం 2 కిలోలపిండి, కిలోన్నర సగ్గుబియ్యం ఉపయోగిస్తారట. పరోటా సిద్ధమయ్యాక దానిని కట్ చేసి బాహుబలి ప్లేట్‌లో పెట్టి.. సాస్, గ్రీన్ చట్నీ, వెల్లుల్లి చట్నీలతో సర్వ్ చేస్తారట. నిజానికి ఈ ఒక్క పరోటా నలుగురు వ్యక్తులకు సరిపోతుంది. కానీ ఇక్కడ ఛాలెంజ్ ప్రకారం ఒక్కరే రెండు పరోటాలు తినాలి.. అదీ గంటలో..
మరిన్ని చూడండి ఇక్కడ: