CM Jagan: గుంటూరు జిల్లాలో ఇస్కాన్ అక్షయపాత్ర.. ప్రారంభించనున్న సీఎం జగన్..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. మంగళగిరి మండలం ఆత్మకూరులో ఇస్కాన్ సంస్థ ఏర్పాటు చేసిన కేంద్రీకృత వంటశాలను సీఎం జగన్ ప్రారంభించనున్నారు.

CM Jagan: గుంటూరు జిల్లాలో ఇస్కాన్ అక్షయపాత్ర.. ప్రారంభించనున్న సీఎం జగన్..
Cm Jagan
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Feb 18, 2022 | 11:47 AM

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(CM YS Jagan Mohan Reddy) ఇవాళ గుంటూరు జిల్లాలో(Guntur district) పర్యటించనున్నారు. మంగళగిరి మండలం ఆత్మకూరులో(Atmakuru) ఇస్కాన్ సంస్థ(Iskcon) ఏర్పాటు చేసిన అక్షయపాత్ర సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ (Akshaya Patra) సీఎం జగన్ ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన ఆహారాన్ని ఇక్కడే తయారు చేయనున్నారు ఇస్కాన్ సభ్యులు. ఇక్కడి నుంచే జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేయనున్నారు. దీని కోసం ఇస్కాన్ అక్షయపాత్ర ఫౌండేషన్ అత్యాధునిక వంటశాలను రెడీ చేసింది. అక్షయపాత్ర సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ ప్రారంభించిన అనంతరం జగన్‌ తాడేపల్లి మండలం కొలనుకొండ వెళ్లనున్నారు. కొలనుకొండలోని ఇస్కాన్ 70కోట్లతో ఏర్పాటు చేస్తున్న గోకుల క్షేత్రానికి సీఎం జగన్ భూమి పూజ చేయనున్నారు. ఇస్కాన్ తరపున ఏపీలో ఇదే అతిపెద్ద ప్రాజెక్టు అని చెప్పవచ్చు.

కొలనుకొండలో గోకుల క్షేత్రంలోనే రాధాకృష్ణులు, వేంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మించనున్నారు ఇస్కాన్ సంస్థ సభ్యులు. అలాగే యోగ ధ్యాన కేంద్రాలు, సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించేందుకు కళా క్షేత్రాలు, యువత కోసం శిక్షణ కేంద్రం ఏర్పాటు కానున్నాయి. గోకుల క్షేత్రానికి భూమి పూజ తర్వాత సీఎం జగన్ నేరుగా తాడేపల్లిలోని ఆయన నివాసానికి చేరుకోనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ తో పాటు పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఇస్కాన్‌ బెంగళూరు ప్రెసిడెంట్‌ మధుపండిట్‌దాస్‌ ముఖ్య అతిథులుగా హాజరవుతారు.

ఇవి కూడా చదవండి: Medaram Jathara 2022: నేడు మేడారానికి సీఎం కేసీఆర్‌.. కుటుంబ సమేతంగా అమ్మవార్లను దర్శించుకోనున్న ముఖ్యమంత్రి..

Singapore PM: సింగపూర్ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు.. భారత్ తీవ్ర అభ్యంతరం.. రాయబారికి సమన్లు..