Ukraine-Russia Crisis: రష్యా- ఉక్రెయిన్ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత.. ఆ ప్రాంతంలో కాల్పుల మోత..
Russia - Ukraine Crisis LIVE Updates: రష్యా- ఉక్రెయిన్ సరిహద్దుల్లో కొన్ని రోజుల నుంచి యుద్ధమేఘాలు అలుముకున్నాయి. రష్యా.. ఉక్రెయిన్‌పై ఎప్పుడైనా దాడి చేసే అవకాశముందని
Russia – Ukraine Crisis LIVE Updates: రష్యా- ఉక్రెయిన్ సరిహద్దుల్లో కొన్ని రోజుల నుంచి యుద్ధమేఘాలు అలుముకున్నాయి. రష్యా.. ఉక్రెయిన్‌పై ఎప్పుడైనా దాడి చేసే అవకాశముందని అమెరికా పదే పదే హెచ్రిస్తోంది. ఇరు దేశాల (Ukraine-Russia) మధ్య సయోధ్య కుదిర్చేందుకు సైతం అమెరికా (US) రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడారు. ఈ క్రమంలో రష్యా సైతం వెనక్కి తగ్గినట్లు ప్రకటించింది. ఈ క్రమంలో మళ్లీ పరిస్థితి మొదటికి చేరింది. తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలోని కాడివ్కా కాల్పుల మోతతో దద్దరిల్లింది. రష్యా మద్దతు కలిగిన వేర్పాటు దళాలు, ఉక్రెయిన్ సైనికుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆ ఘటనలో ప్రాణనష్టం లేనప్పటికీ ఇరు దేశాల పౌరులకు గాయాలైనట్లు వార్త కథనాలు వెలువడుతున్నాయి. కాగా.. ఇద్దరికి తీవ్ర గాయలైనట్లు మీడియా వెల్లడించింది. అయితే.. చర్చల వేళ.. సరిహద్దు ప్రాంతంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం పట్ల ఇరుదేశాలు ఒకరిపై మరొకటి ఆరోపణలు చేసుకుంటున్నాయి. సరిహద్దు ప్రాంతంలో గ్రనేడ్లు, భారీ ఆయుధాలతో వేర్పాటువాదులే కాల్పులు జరిపినట్లు ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. మరోవైపు ప్రభుత్వ బలగాలే తమపై కాల్పులు జరిపినట్లు వేర్పాటువాదులు ఆరోపిస్తున్నారు. గత 24 గంటల్లో నాలుగు సార్లు తమపై కాల్పులు జరిపినట్లు పేర్కొంటున్నారు. సరిహద్దుల్లో సైన్యం మోహరించిన తరుణంలో రెచ్చగొట్టే చర్యల్లో భాగంగానే ఈ ఘటన జరిగినట్లు పలు దేశాలు అనుమానిస్తున్నాయి.
అయితే.. ఉక్రెయిన్ ఆక్రమణకు ఓ కారణాన్ని చూపడంతోపాటు ఆ ప్రాంతంలో మారణహోమం సృష్టించేందుకు రష్యా ప్రయత్నాలు చేస్తున్నట్లు అగ్రరాజ్యం అమెరికా వెల్లడించింది. చర్చల వేళ ఇలాంటి దురాక్రమణకు పాల్పడటం మానుకోవాలని హెచ్చరించింది. అయితే, పొరుగు దేశంపై దాడి చేయాలని యోచిస్తున్నట్లు తమపై వచ్చిన అభియోగాలని రష్యా ప్రతినిధులు ఖండించారు. అంతకుముందు ప్రకటించిన మాదిరిగానే.. సరిహద్దుల్లో మోహరించిన తమ సైన్యాన్ని వెనక్కి పిలిపిస్తున్నట్లు రష్యా తెలిపింది. ఇప్పటికే దాదాపు లక్షకుపైగా సైనికులను వెనక్కి రప్పించే పనిలో ఉన్నామని తెలిపింది. అయితే.. రష్యా ప్రకటనను అమెరికా నమ్మడం లేదు. ఇంకా వేలాది రష్యా బలగాలు సరిహద్దుకు సమీపలంలోనే ఉన్నాయని.. అమెరికా ఆరోపిస్తుంది. ఈ తరుణంలో కాల్పులు జరగడం మరింత ఆందోళనకు దారితీసింది.
Also Read: