Ukraine – Russia War: రష్యా – ఉక్రేయిన్ వివాదంలో మరో ట్విస్ట్.. తగ్గేదే లే అంటున్న రష్యా.. సరిహద్దుల్లో ఏకంగా..
Ukraine - Russia War: ఉక్రెయిన్ - రష్యా సమస్యకు ఇప్పట్లో పుల్ స్టాప్ పడేలా లేదు. యుద్దం విషయంలో వెనక్కి తగ్గామని.. సైనికులను వెనక్కి రప్పించామని..
Ukraine – Russia War: ఉక్రెయిన్ – రష్యా సమస్యకు ఇప్పట్లో పుల్ స్టాప్ పడేలా లేదు. యుద్దం విషయంలో వెనక్కి తగ్గామని.. సైనికులను వెనక్కి రప్పించామని చెబుతున్న రష్యా అధ్యక్షుడి మాటల్లో నిజం కనిపించడం లేదు. ఇవాళ భారీ ఎత్తున రష్యా వ్యూహాత్మక సైనికులు క్షిపణుల యుద్ద విన్యాసాలకు రెడీ అవుతున్నారు. ఈ విన్యాసాలను ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ స్వయంగా పర్యవేక్షించడం.. దీనిపై రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటన చేయడం యుద్ధానికి మరింత బలం చేకూరుస్తుంది. అయితే ఉక్రెయిన్‌పై రష్యా అణుశక్తిని ఉపయోగించేందుకు ఏమాత్రం వెనకాడడం లేదని.. ఈ విన్యాసాలు దానికి సంకేతమని చెబుతున్నాయి.
ఇక ఈ విన్యాసాల్లో క్రూజ్ క్షిపణులు, ఖండాంతర బాలిస్టిక్‌లను ఉపయోగించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు రష్యా సైనికులు. వీటిని ప్రయోగించేందుకు రష్యా సైన్యం చాలా రోజుల నుంచే ప్లాన్ చేసుకున్నట్లు ఆదేశ రక్షణశాఖ చెప్పింది. మరికొద్ది రోజుల్లో ఉక్రెయిన్‌పై యుద్ధం తధ్యమని ప్రకటించిన వెంటనే ఈ విన్యాసాలపై ప్రకటన చేసింది. ఓ వైపు తాము ఉక్రెయిన్‌తో యుద్ధం కోరుకోవడం లేదని చెబుతూనే దేశ సరిహద్దు దగ్గరకు లక్షా యాభై వేల మంది సైనికులను తరలించడం యుద్దానికి రష్యా ఆజ్యం పోస్తుంది. యుద్ధం విషయంలో రష్యాకు వ్యతిరేకంగా అమెరికా లాంటి దేశాలు చేసిన వ్యాఖ్యలు నిజమవుతున్నాయి.
Also read:
Andhra Pradesh: రైల్వే స్టేషన్‌లో సరదాగా యువకుడు.. తేడా కొట్టడంతో బ్యాగ్ చెక్ చేసిన అధికారులు షాక్..
Tollywood: టాలీవుడ్ హీరో చేతిలో మరో స్టార్ హీరో.. ఆ ఇద్దరూ ఎవరో తెలుసా.?(Video)