Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: రైల్వే స్టేషన్‌లో సరదాగా యువకుడు.. తేడా కొట్టడంతో బ్యాగ్ చెక్ చేసిన అధికారులు షాక్..

Andhra Pradesh: మత్తుకు బానిసైన యువత, తమ భవిష్యత్తును వాశనం చేసుకుంటున్నారు. అక్రమ రవాణాలోకి దిగి జీవితాన్ని జైలు పాలు చేసుకుంటున్నారు.

Andhra Pradesh: రైల్వే స్టేషన్‌లో సరదాగా యువకుడు.. తేడా కొట్టడంతో బ్యాగ్ చెక్ చేసిన అధికారులు షాక్..
Drugs
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 19, 2022 | 9:26 AM

Andhra Pradesh: మత్తుకు బానిసైన యువత, తమ భవిష్యత్తును వాశనం చేసుకుంటున్నారు. అక్రమ రవాణాలోకి దిగి జీవితాన్ని జైలు పాలు చేసుకుంటున్నారు. తాజాగా ఒంగోలులో ఓ బీజెక్‌ విద్యార్థి డ్రగ్స్‌తో పట్టుబడ్డాడు. ఈజీగా మనీ సంపాదించడం, మత్తుకు బానిస కావడం ఈ కాలంలో కామన్‌గా మారింది. ఈ రెండు కారణాల వల్ల ఎంతో మంది యువకులు జైలుకు వెళ్లాల్సి వస్తోంది. తాజాగా ఒంగోలు రైల్వే స్టేషన్‌లో మాదకద్రవ్యాలు రవాణా చేస్తున్న వైజాగ్‌కు చెందిన బిటెక్‌ విద్యార్థిని, ఎస్‌ఈబి అధికారులు అరెస్ట్‌ చేశారు. ఈ ఇంజనీరింగ్‌ విద్యార్థి బెంగుళూరు నుంచి వైజాగ్‌కు నిషేధిత మాదకద్రవ్యాలు తీసుకెళుతుండగా పట్టుకున్నారు ఎస్‌ఈబి అధికారులు. ఆ విద్యార్థి నుంచి 2 లక్షల విలువైన నిషేధిత డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. నాలుగు ఎల్ఎస్‌డి స్టిక్కర్లు, 0.97 గ్రాముల ఎంఎండీఏ, 0.41 గ్రాముల ఈసీఎస్‌టిఏసీవై ని స్వాధినం చేసుకున్నట్టు తెలిపారు ఎస్‌ఈబి అధికారులు.

కాగా, ఇప్పుడు పట్టుబడ్డ విద్యార్థి చిన్నతనం నుంచే గంజాయికి బానిస అయినట్టు వెల్లడించారు అధికారులు. అలా అలవాటు పడి అనంతరం డ్రగ్స్‌ సరఫరా చేసే పెడ్లర్‌గా మారాడని గుర్తించారు. వైజాగ్‌ నుంచి బెంగుళూరుకు గంజాయిని సరఫరా చేసి, అక్కడి నుంచి నిషేధిత మాదకద్రవ్యాలు వైజాగ్‌కు తీసుకెళుతున్నట్టు విచారణలో తేలిందని చెప్పారు ఎస్‌ఈబీ అధికారులు. కాగా, మత్తుకు బానిస కావొద్దని, పెడ్లర్‌లుగా మారోద్దని సూచిస్తున్నారు అధికారులు. ఎవరో చెప్పిన మాటలు విని జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచిస్తు్న్నారు.

Also read:

Petrol Diesel Prices: దేశంలో పెట్రోల్‌ డీజిల్‌ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..

Health News: ఉదయం లేవగానే ఫోన్ చూస్తున్నారా.? అయితే ప్రమాదమే.. ఇవి తెలుసుకోండి!(Video)

అతనో మోటివేషనల్ స్పీకర్.. చేసింది తెలిస్తే మాత్రం షాక్ అవడం పక్కా