Petrol Diesel Prices: దేశంలో పెట్రోల్‌ డీజిల్‌ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..

Petrol, Diesel Prices Today: మూడు నెలల క్రితం పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు బ్రేకులు పడ్డాయి. దేశంలో ప్రస్తుతం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గతంలో..

Petrol Diesel Prices: దేశంలో పెట్రోల్‌ డీజిల్‌ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..
Follow us
Subhash Goud

|

Updated on: Feb 19, 2022 | 9:22 AM

Petrol, Diesel Prices Today: మూడు నెలల క్రితం పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు బ్రేకులు పడ్డాయి. దేశంలో ప్రస్తుతం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గతంలో వందలోపు ఉన్న ధరలు.. ఇప్పుడు వందకుపైగా కొనసాగుతున్నాయి. అయితే గ్లోబల్‌ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నా ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతుండటం గమనార్హం. అయితే తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో ధరల్లో అతి స్వల్ప మార్పులు ఉన్నాయి. శనివారం (జనవరి 19)న దేశవ్యాప్తంగా లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇలా ఉన్నాయి.

దేశంలోనిప్రధాన నగరాల్లో..

► ఢిల్లీలో పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.95.41 ఉండగా, డీజిల్‌ ధర రూ.86.67 ఉంది.

► ముంబైలో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.109.98 ఉండగా, డీజిల్‌ ధర రూ.94.14 ఉంది.

► చెన్నైలో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.109.98 ఉండగా, డీజిల్‌ ధర రూ.91.43 ఉంది.

► కోల్‌కతా పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.104.67 ఉండగా, డీజిల్‌ ధర రూ.89.79 ఉంది.

► బెంగళూరులో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.100.58 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.01 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

► హైదరాబాద్‌లో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.108.20 ఉండగా, డీజిల్‌ ధర రూ.94.62గా ఉంది.

► వరంగల్‌లో పెట్రోల్ లీటర్‌ ధర రూ.107.88 ఉండగా, డీజిల్ ధర రూ.94.31 గా ఉంది.

► కరీంనగర్‌లో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.108.36 ఉండగా, డీజిల్‌ ధర రూ.94.78 ఉంది.

► విజయవాడలో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.110.08 ఉండగా, డీజిల్‌ ధర రూ.96.19గా ఉంది.

► విశాఖపట్నంలో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.109.32 ఉండగా, డీజిల్‌ ధర రూ.95.43 ఉంది.

► విజయనగరంలో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.110.57 ఉండగా, డీజిల్‌ ధర రూ.96.59గా ఉంది.

కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తర్వాత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు లడఖ్, జమ్మూ, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, సిక్కిం, మిజోరం, డామన్ డయ్యూ, కర్ణాటక, పుదుచ్చేరిలలో వ్యాట్‌ను తగ్గించాయి. గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. గత సంవత్సరం ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం ధరలు ఏ మాత్రం తగ్గలేదు.

ఇవి కూడా చదవండి:

Gold, Silver Price Today: వినియోగదారులకు షాకిస్తున్న బంగారం, వెండి.. పెరిగిన ధరలు

Maruti Suzuki: మారుతి సుజుకి కారు కొనాలనుకుంటున్నారా..? భారీ ఆఫర్లు..!