Rakesh Jhunjhunwala: 17 రోజుల పాటు వరుసగా పెరిగిన రాకేశ్ ఝున్ ఝున్ వాలా పెట్టుబడి పెట్టని ఆ షేర్.. ఇప్పుడెలా ఉందంటే..
Rakesh Jhunjhunwala: స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ రాకేశ్ ఝున్ ఝున్ వాలా పెట్టుబడి పెట్టిన షేరు జనవరి 28, 2022 నుంచి వరుసగా పెరుగుతోంది. వరుసదా అప్పర్ సర్కూట్(Upper circuit) లను తాకుతూ షేర్ పెరుగుతూ పోయింది. కానీ..
Rakesh Jhunjhunwala: స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ రాకేశ్ ఝున్ ఝున్ వాలా పెట్టుబడి పెట్టిన షేరు జనవరి 28, 2022 నుంచి వరుసగా పెరుగుతోంది. వరుసదా అప్పర్ సర్కూట్(Upper circuit) లను తాకుతూ షేర్ పెరుగుతూ పోయింది. కానీ.. గత అయిదు రోజులుగా షేర్ పతనమవుతూ వస్తోంది. గురువారం డిబి రియల్టీ(DB Reality) స్టాక్ ఎన్ఎస్ఈలో ముగింపు ధర రూ. 113.45గా ఉంది. గడచిన 5 రోజులుగా షేర్ విలువ ఏకంగా 17 శాతం మేర తగ్గింది. షేర్ కు రూ. 100 ధర వద్ద గట్టి సపోర్ట్ ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
డిబి రియల్టీ షేర్ ధర గత వివరాలు ఇలా ఉన్నాయి..
ఈనెల ఫిబ్రవరి 14న 52 వారాల గరిష్ఠాన్ని(రూ. 134.05) తాకిన డిబి రియల్టీ షేర్.. వరుసగా అయిదు ట్రేడింగ్ సెషన్ల నుంచి లోయర్ సర్కూట్ లను తాకుతూ 17 శాతం విలువను కోల్పోయింది. కంపెనీ కొత్తగా నిధులను సమీకరించనుందని, రాకేశ్ ఝున్ ఝున్ వాలా కంపెనీలో తన వాటాను పెంచుకుంటున్నట్లు వచ్చిన వార్తలతో షేర్ ధర రూ. 74.90 నుంచి 134.05 వరకు పెరిగింది. అంటే షేర్ ధర కేవలం 12 ట్రేడింగ్ సెషన్లలో 80 శాతం పెరిగింది. 2021 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో డిబి రియల్టీలో రాకేశ్ 50 లక్షల షేర్లు కలిగి ఉన్నారు. అంటే అది కంపెనీలో 2.06 శాతం వాటా. త్వరలోనే షేర్ విలువ రూ. 100 కు దగ్గరలో స్థిరపడనున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చదవండి..
LIC IPO: ఎల్ఐసీ ఐపీఓలో ఎవరికి ఎన్ని షేర్లు ఇవ్వనుంది.. ఎల్ఐసీ దాచిన వాస్తవాలు ఇప్పుడు మీకోసం..
Phone Pe: బంపర్ ఆఫర్ ప్రకటించిన ఫోన్ పే.. అలా చేసిన వారికి రూ. 5 లక్షలు ప్రైజ్ మనీ..