Phone Pe: బంపర్ ఆఫర్ ప్రకటించిన ఫోన్ పే.. అలా చేసిన వారికి రూ. 5 లక్షలు ప్రైజ్ మనీ..
Phone Pe: డిజిటల్ చెల్లింపుల పేమెంట్ దిగ్గజం ఫోన్ పే గురువారం నాడు బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీనికి నీతీ ఆయోగ్ కూడా దీని కోసం ఫోన్ పే తో జతకట్టింది. ఈ రెండు కలిపి మెుదటి సారిగా దేశంలో..
Phone Pe: డిజిటల్ చెల్లింపుల పేమెంట్ దిగ్గజం ఫోన్ పే గురువారం నాడు బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీనికి నీతీ ఆయోగ్ కూడా దీని కోసం ఫోన్ పే తో జతకట్టింది. ఈ రెండు కలిపి మెుదటి సారిగా దేశంలో హ్యాకథాన్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఫిన్ టెక్ కంపెనీలకు అవసరమైన సొల్యూషన్స్ పై దృష్టి సారిస్తోంది. హ్యాకథాన్ ద్వారా దేశం నలుమూలల నుండి ఆవిష్కర్తలు, డిజిటల్ సృష్టికర్తలు, డెవలపర్‌లకు కొత్తగా ఆలోచించడానికి, ఆలోచనలు అమలు చేయడానికి, కోడ్ చేయడానికి అవకాశాన్ని దీని ద్వారా ఫోన్ పే అందిస్తోంది. ఇందులో విజేతలుగా నిలిచిన జట్టుకు రూ. 5 లక్షలు నగదు బహుమతులు అందిస్తున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రోటోటైప్ చేసేవారు ఫోన్ పే పల్స్, ఓపెన్ గవర్నమెంట్ డాటా ప్లాట్ ఫామ్, ఆర్భీఐ రిప్రోర్టులను ఆవిష్కర్తలు వినియోగించుకోవచ్చని తెలిపింది. దీనికి తోడు సేతు AA శాండ్ బాక్స్ తో పాటు వారికి తెలిసిన డాటా ప్లాట్ ఫామ్ లను వినియోగించుకోవచ్చని ఫోన్ పే స్పష్టం చేసింది.
ఈ పోటీలో పాల్గొని మెుదటి విజేతగా నిలిచిన వారికి రూ. 1.5 లక్షలు, రెండు స్థానంలో నిలిచిన విజేతకు రూ. లక్ష, మూడో స్థానంలో నిలిచిన విజేతకు రూ. 75 వేలు బహుమతి సొమ్మును అందిస్తున్నట్లు ఫోన్ పే వెల్లడించింది. దీనికి రెజిస్టేషన్ చేసుకునేందుకు ఆఖరు తేదీ ఫిబ్రవరి 23 కాగా.. తుది ఎంట్రీలను చివరి తేదీ ఫిబ్రవరి 25 మధ్యాహ్నం లోగా సమర్పించాలి. హ్యాకథాన్ గురించి పాల్గొనేవారు ఏవైనా సందేహాలకు సమాధానమివ్వడానికి ఫిబ్రవరి 21న సాయంత్రం 4:00 గంటలకు ప్రత్యక్ష ప్రసార AMA ఉంటుంది. హ్యాకథాన్ విజేతలను ఫిబ్రవరి 28న ప్రకటిస్తారు.
ఇవీ చదవండి..