IPO New Rules: కొత్తగా మార్కెట్లోకి వస్తున్న ఐపీఓలకు ఆ నిబంధనలు తెచ్చిన సెబీ.. పెట్టుబడికి ముందు మీరూ గమనించండి..
IPO New Rules: స్టాక్ మార్కెట్ రెగ్యూలేటరీ సంస్థ సెబీ(SEBI) శుక్రవారం తాజాగా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. నష్టాలను నమోదు చేస్తూ కొత్తగా మార్కెట్ లోకి లిస్ట్ అయ్యేందుకు వస్తున్న అనేక కొత్త తరం టెక్ కంపెనీలకు..
IPO New Rules: స్టాక్ మార్కెట్ రెగ్యూలేటరీ సంస్థ సెబీ(SEBI) శుక్రవారం తాజాగా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. నష్టాలను నమోదు చేస్తూ కొత్తగా మార్కెట్ లోకి లిస్ట్ అయ్యేందుకు వస్తున్న అనేక కొత్త తరం టెక్ కంపెనీలకు(New age tech companies) ఈ నిబంధనలు వర్తించనున్నాయి. సదరు స్టార్టర్ కంపెనీలు మార్కెట్ లో లిస్ట్ అవ్వడానికి ముందు ఆఫర్ డాక్యుమెంట్‌లలో ఇష్యూ ధర ఆధారంగా చేరుకోవడానికి పరిగణలోకి తీసుకున్న వివిధ కారణాలు, సూచికలను ఇకపై బహిర్గతం చేయాల్సి ఉంటుంది.
దీనికి తోడు ఐపీఓకి రావడానికి ముందు 18 నెలల్లో చేపట్టిన షేర్ క్రయవిక్రయాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయవలసి ఉంటుంది. గత కొంతకాలంగా ఐపీఓలుగా మార్కెట్లలోకి వస్తున్న స్టార్టప్ కంపెనీలు తమ షేర్ల విలువ కోల్పోవడం, లిస్టింగ్ సమయంలో భారీగా షేర్ ధరలు నమోదుకావడం వంటి విషయాలను పరిగణలోకి తీసుకుని సెబీ కొత్తగా ఈ నిబంధనలను ప్రవేశ పెట్టింది. ఐపీఓకు ముందు మూడు సంవత్సరాల పనితీరు షేర్ ధర నిర్ణయానికి ఎలా ప్రభావం చూపుతాయో సదరు కంపెనీలు సెబీకి వివరంగా చెప్పాల్సి ఉంటుంది. సదరు కంపెనీ ఎటువంటి దాపరికాలు లేకుండా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది.
సాదారణంగా ఇలాంటి కంపెనీలు ఎక్కువ కాలంపాటు నష్టాలను నమోదు చేస్తుంటాయి. వాటి వ్యాపారాలను పూర్తి స్థాయిలో విస్తరించడం, లాభాల్లోకి వెళ్లడానికి కొన్ని సంవత్సరాలు పడుతున్నందున సెబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం, ఆఫర్ డాక్యుమెంట్‌లోని ‘బేసిస్ ఆఫ్ ఇష్యూ ప్రైస్’ విభాగం కీలక అకౌంటింగ్ నిష్పత్తుల వంటి సాంప్రదాయ పద్ధతులను బహిర్గతం చేస్తోంది. వీటిలో ఎర్నింగ్స్ పర్ షేర్, ప్రైస్ టు ఎర్నింగ్స్, నికర విలువపై రాబడి, కంపెనీ నికర ఆస్తి విలువ అలాగే అదే వ్యాపారంలో ఉన్న సహచర కంపెనీల అకౌంటింగ్ నిష్పత్తులతో వీటిని పోల్చడం అనే ప్రక్రియ కొనసాగుతోంది.
ఇవీ చదవండి..
LIC IPO: ఎల్ఐసీ ఐపీఓలో ఎవరికి ఎన్ని షేర్లు ఇవ్వనుంది.. ఎల్ఐసీ దాచిన వాస్తవాలు ఇప్పుడు మీకోసం..