Health News: ఉదయం లేవగానే ఫోన్ చూస్తున్నారా.? అయితే ప్రమాదమే.. ఇవి తెలుసుకోండి!(Video)

Health News: ఉదయం లేవగానే ఫోన్ చూస్తున్నారా.? అయితే ప్రమాదమే.. ఇవి తెలుసుకోండి!(Video)

Ravi Kiran

|

Updated on: Feb 19, 2022 | 9:21 AM

ప్రస్తుత కాలంలో జనాలకు మొబైల్‌ ఒక వ్యసనంగా మారిపోయింది. ఉదయం లేచిన దగ్గర్నుంచి.. అర్థరాత్రి వరకు గంటల తరబడి ఫోన్‏లో మునిగిపోతున్నారు...



ప్రస్తుత కాలంలో జనాలకు మొబైల్‌ ఒక వ్యసనంగా మారిపోయింది. ఉదయం లేచిన దగ్గర్నుంచి.. అర్థరాత్రి వరకు గంటల తరబడి ఫోన్‏లో మునిగిపోతున్నారు. నిద్రపోయేముందు ఫోన్‌ చూస్తూనే నిద్రపోతారు.. నిద్రలేవగానే కూడా ఫోన్‌ చూడటంతోనే రోజు ప్రారంభమవుతుంది. ఇలా చేయడం చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. ఫోన్ ఎల్ఈడీ ప్రకాశవంతమైన నీలం కాంతిని కలిగి ఉంటుంది. ఇది నేరుగా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రమాదమేనట. రాత్రి పడుకునే ముందు చాలా మంది ఫోన్ చూస్తుంటారు. దాంతో ఫోన్‌ మెరుపు చాలా సమయం వరకు మీ కళ్లముందే ఉంటుంది..ఫలితంగా సమయానికి నిద్రపోలేరు. ఇక ఉదయం లేవగానే ఫోన్ చూస్తే మానసిక క్షోభ కలుగుతుందట. ఆందోళన, నిద్రలేమి, తల, మెడ నొప్పి, చేతుల నొప్పులు వంటి సమస్యలు తలెత్తుతాయట. అందుకే నిద్రపోయే ముందు, నిద్ర లేచిన తర్వాత ఫోన్ చూసే అలవాటు మానుకుంటే మంచిదంటున్నారు నిపుణులు. అంతేకాదు లేవగానే ఫోన్ చూడడం వలన ఏకాగ్రత లోపిస్తుందట. ఇటీవల జరిగిన అధ్యాయనాల ప్రకారం ఉదయం నిద్రలేవగానే ఫోన్ చూడడం వలన అధిక రక్తపోటు సమస్య వేధిస్తుందని.. ఈ లైటింగ్ వలన ఒత్తిడి పెరిగి.. క్రమంగా రక్తపోటు సమస్యకు దారితీస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.