అలా చేయడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
కరోనా థర్డ్‌వేవ్ కారణంగా భారీగా పెరిగిన కేసులు ప్రస్తుతం తగ్గుతున్నాయి. దీంతో పరీక్షలు చేయడంలో అలసత్వం కనిపిస్తోంది. అయితే ఇలా వ్యవహరించడం మంచిది కాదని..
కరోనా థర్డ్‌వేవ్ కారణంగా భారీగా పెరిగిన కేసులు ప్రస్తుతం తగ్గుతున్నాయి. దీంతో పరీక్షలు చేయడంలో అలసత్వం కనిపిస్తోంది. అయితే ఇలా వ్యవహరించడం మంచిది కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ‘వైరస్ ఎక్కడ, ఎలా ఉంది? ఎలా రూపాంతరం చెందుతోందనే విషయాలను తెలుసుకోవం ద్వారా వైరస్ కట్టడికి చర్యలు తీసుకోవచ్చని డబ్ల్యూహెచ్‌ఓ సాంకేతిక విభాగాధిపతి మరియా వాన్ కెర్ఖోవ్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా నిర్ధరణ పరీక్షలు ఒక్కసారిగా పడిపోయినట్లు తాము గుర్తించామన్నారు. ఓ వ్యక్తికి వైరస్ సోకిందని తెలిసేందుకు, అతనికి వైద్యం అందించేందుకు కచ్చితంగా పరీక్షలు చేయాల్సిందేనని ఆమె వెల్లడించారు. అందుకే కరోనా పరీక్షల్లో నిర్లక్ష్యం వహించకూడదని కోరారు.
వైరస్‌ను గుర్తించేందుకు నాణ్యమైన టెస్ట్ కిట్‌లు అవసరమని మరియా సూచించారు. వినియోగానికి వీలుగా, వేగంగా ఫలితాలను చూపించే, నాణ్యమైన కిట్‌లను వినియోగించాలన్నారు. ఒమిక్రాన్ చివరిది కాదని, మరింత ప్రమాదకర వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని మరియా కొద్దిరోజుల క్రితమే హెచ్చరించారు. కొత్త వేరియంట్లను ‘వైల్డ్‌కార్ట్ ఎంట్రీ’గా ఆమె తెలిపారు. ఒమిక్రాన్ ఉపవేరియంట్ BA-1 కన్నా తాజాగా బయటపడిన ఉపవేరియంట్ BA-2 మరింత వేగంగా వ్యాప్తి చెందుతోందనని తెలిపారు. ఒమిక్రాన్ తర్వాత మరో వేరియంట్ వస్తే అది దీనికంటే ఎక్కువ శక్తిసామర్థ్యాలను కలిగి ఉండే అవకాశం ఉందని ఆమె అన్నారు.
Also Read
నెక్ట్ సెంచరీ ఇక్కడే చేయాలంటోన్న పాక్ ఫ్యాన్స్.. పీఎస్‌ఎల్‌లో మారుమోగిన విరాట్.. ఎందుకో తెలుసా?