Imran Khan: అసలు సీక్రెట్‌ను దాచిన పాక్ ప్రధాని ఇమ్రాన్.. మార్ఫింగ్ మాయతో అడ్డంగా బుక్కయ్యాడు..

బిల్ గేట్స్‌కు ఆతిథ్యమిచ్చిన ఫొటోలను తన ట్విటర్‌ ఖాతా ద్వారా పంచుకున్నారు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan). ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. అసలు సీక్రెట్‌ను దాచేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు పాక్‌ ప్రధాని.

Imran Khan: అసలు సీక్రెట్‌ను దాచిన పాక్ ప్రధాని ఇమ్రాన్.. మార్ఫింగ్ మాయతో  అడ్డంగా బుక్కయ్యాడు..
Imrankhan
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 20, 2022 | 8:00 AM

బిల్‌ గేట్స్‌(Bill Gates ) బహుశా ప్రపంచంలో ఈ పేరు తెలియని వారుండరు. అలాంటి ప్రముఖుడు ఇటీవల తొలిసారిగా పాకిస్తాన్‌లో(Pakistan) పర్యటించారు. బిల్ గేట్స్‌కు ఆతిథ్యమిచ్చిన ఫొటోలను తన ట్విటర్‌ ఖాతా ద్వారా పంచుకున్నారు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan). ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. అసలు సీక్రెట్‌ను దాచేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు పాక్‌ ప్రధాని. ఇమ్రాన్ ఖాన్ షేర్‌ చేసిన ఫొటోలో ఓ వ్యక్తిని మార్ఫ్‌ చేసినట్లు కన్పిస్తోంది. అయితే ఆ మార్ఫింగ్ చేసిన స్థలంలో ఉన్న వ్యక్తి ఐఎస్‌ఐ చీఫ్‌ లెఫ్టినెంట్‌ నదీమ్ అంజున్‌ ప్రపంచ వ్యాప్తంగా చర్చ మొదలైంది. దీంతో ఐఎస్‌ఐ చీఫ్‌ను దాచిపెట్టారంటూ ఇమ్రాన్‌పై నెట్టింట్లో విమర్శలు మొదలయ్యాయి. ఫిబ్రవరి 17న ఇమ్రాన్‌ ఈ ఫొటోలను తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఇమ్రాన్ పోస్ట్‌ చేసిన వెంటనే అందులో ఒక వ్యక్తిని ఫొటోషాప్‌ సాయంతో మార్ఫ్‌ చేసినట్లు  నెటిజన్లు. ఆ ఫొటోలో బిల్‌గేట్స్‌, ఇమ్రాన్ సహా, అందరూ ఆ వ్యక్తి వైపే చూస్తున్నట్లుగా ఉండటంతో ఆ వ్యక్తి ఎవరై ఉంటారా అన్న ఆసక్తి మొదలైంది.

ఎందుకు మార్ఫ్‌ చేశారా అన్న ప్రశ్న తలెత్తింది. ఆయన ఐఎస్‌ఐ చీఫ్‌ లెఫ్టినెంట్‌ నదీమ్‌ అని ఈ సమావేశంతో సంబంధమున్న వ్యక్తులు కొందరు చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అధికారిక సమావేశాల్లో తన ఫొటోలు, వీడియోలు తీయొద్దని ఐఎస్‌ఐ చీఫ్‌, ప్రభుత్వానికి చెప్పారట. అందుకే తాజా ఫొటోలో ఆయన ముఖాన్ని మార్ఫ్‌ చేసినట్లు తెలుస్తోంది.

గతేడాది అక్టోబరులో ఐఎస్‌ఐ నూతన చీఫ్‌గా నదీమ్‌ అంజుమ్‌ నియమితులయ్యాడు. నదీమ్‌ నియామకాన్ని ఆర్మీ మీడియా వింగ్‌ ప్రకటించగా.. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇమ్రాన్‌ ప్రభుత్వం ధ్రువీకరించింది. దీంతో ప్రభుత్వానికి, ఆర్మీకి మధ్య అంతర్గత పోరుపై వార్తలు జోరుగా మొదలయ్యాయి. ఏదేమైనా అతని ఫొటోను మార్ఫ్‌ చేయడానికి ఇంకా ఎదో పెద్ద కారణమే ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

ఇవి కూడా చదవండి: Raja singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఈసీ షాక్‌.. ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ఆదేశం..

Medaram Jatara 2022: ముగిసిన మేడారం జాతర.. జనం నుంచి వనంలోకి వెళ్లిన వనదేవతలు.. కోటిన్నర మంది దర్శించుకున్నారని అంచనా

హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..7 నుంచి 13 వరకు పాఠశాలలకు సెలవులు
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..7 నుంచి 13 వరకు పాఠశాలలకు సెలవులు