నెక్ట్స్ సెంచరీ ఇక్కడే చేయాలంటోన్న పాక్ ఫ్యాన్స్.. పీఎస్‌ఎల్‌లో మారుమోగిన విరాట్.. ఎందుకో తెలుసా?

PSL 2022: భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి 71వ సెంచరీ కోసం విరాట్ ఫ్యాన్స్‌తో పాటు క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. రెండేళ్లుగా విరాట్ కోహ్లీ సెంచరీ చేయడంలో విఫలమవుతున్నాడు.

నెక్ట్స్ సెంచరీ ఇక్కడే చేయాలంటోన్న పాక్ ఫ్యాన్స్.. పీఎస్‌ఎల్‌లో మారుమోగిన విరాట్.. ఎందుకో తెలుసా?
Psl Virat Kohli
Follow us
Venkata Chari

|

Updated on: Feb 20, 2022 | 7:42 AM

PSL 2022: భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి(Virat Kohli) 71వ సెంచరీ కోసం విరాట్ ఫ్యాన్స్‌తో పాటు క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. రెండేళ్లుగా విరాట్ కోహ్లీ సెంచరీ చేయడంలో విఫలమవుతున్నాడు. అయితే, ప్రస్తుతం ఈ లిస్టులో పాకిస్తాన్(Pakistan) క్రికెట్ ఫ్యాన్స్ కూడా చేరిపోయారు. కోహ్లి బ్యాట్ నుంచి పరుగులు వస్తున్నా.. తన ఇన్నింగ్స్‌ను సెంచరీగా మలచలేకపోతున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) సందర్భంగా లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో కోహ్లీ పోస్టర్‌తో కొందరు అభిమానులు కనిపించారు. ‘మీ సెంచరీని పాకిస్థాన్‌లో చూడాలని ఉంది’ అని పోస్టర్‌పై రాసి మ్యాచ్‌లో ప్రదర్శించారు. మ్యాచ్ సందర్భంగా, చాలా మంది అభిమానులు రోహిత్ పోస్టర్‌తో కూడా కనిపించారు.

రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్‌తో జరిగిన డే-నైట్ టెస్టులో విరాట్ సెంచరీ సాధించాడు. డే-నైట్ టెస్టులో అతను 136 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ సెంచరీ తర్వాత కోహ్లి 69 ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే కోహ్లీ మాత్రం మరో సెంచరీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు.

విరాట్‌, రోహిత్‌ పోస్టర్లతో అభిమానులు కనిపించిన ఈ మ్యాచ్‌లో రిజ్వాన్‌-రూసో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడారు. శుక్రవారం క్వెట్టా, ముల్తాన్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్ కెప్టెన్ రిజ్వాన్ 54 బంతుల్లో అజేయంగా 83, రిలే రస్సో 26 బంతుల్లో 71 పరుగులు చేశారు. ముల్తాన్ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. వీరిద్దరూ కాకుండా ఓపెనర్ షాన్ మసూద్ కూడా 38 బంతుల్లో 57 పరుగులు చేశాడు.

క్వెట్టా గ్లాడియేటర్స్ 15.5 ఓవర్లలో 128 పరుగులకే కుప్పకూలడంతో ముల్తాన్ 117 పరుగుల తేడాతో విజయం సాధించింది. మసూద్, రిజ్వాన్ బ్యాటింగ్ చేస్తుండగా కెమెరాలో విరాట్ పోస్టర్ కనిపించాయి.

2008 నుంచి పాకిస్థాన్ పర్యటనకు వెళ్లలేదు.. టీమిండియా చివరిసారిగా 2008లో పాకిస్థాన్ పర్యటనకు వెళ్లింది. దీని తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు సరిగా లేకపోవడంతో టీమిండియా పాకిస్థాన్‌లో పర్యటించలేదు. ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా జరగవు. ఐసీసీ టోర్నీలోనే ఇరు దేశాలు తలపడుతున్నాయి. చివరిసారిగా 2012-13లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగింది.

ఈ సిరీస్‌ను పాక్‌ జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అదే సమయంలో టీ20 సిరీస్‌ 1-1తో సమమైంది. 2021లో టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు తొలిసారిగా ప్రపంచకప్‌లో టీమిండియాను ఓడించింది. ఇప్పుడు ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ప్రపంచకప్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఈ ఏడాది అక్టోబర్ 23న జరగనుంది.

Also Read: Rohit Sharma: టీమిండియా టెస్ట్‌ కెప్టెన్‌గా హిట్‌ మ్యాన్‌.. బీసీసీఐ అధికారిక ప్రకటన.. వైస్‌ కెప్టెన్‌ ఎవరో తెలుసా?

దోషిగా తేలితే ఆ ప్లేయర్‌ IPL కాంట్రాక్ట్ రద్దవుతుందా.. క్రికెట్‌ ఆడకుండా నిషేధిస్తారా..?