Rohit Sharma: టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా హిట్ మ్యాన్.. బీసీసీఐ అధికారిక ప్రకటన.. వైస్ కెప్టెన్ ఎవరో తెలుసా?
టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Rohit Sharma) ను బీసీసీఐ (BCCi) అధికారికంగా ప్రకటించింది.
టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Rohit Sharma) ను బీసీసీఐ (BCCi) అధికారికంగా ప్రకటించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్, యంగ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్, పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాల పేర్లు వినిపించినప్పటికీ బీసీసీఐ మాత్రం హిట్‌మ్యాన్‌పైనే నమ్మకముంచింది. ఇప్పటికే టీ-20, పరిమిత ఓవర్ల ఫార్మాట్లో టీమిండియాను ముందుండి నడిపిస్తోన్న రోహిత్ సుదీర్ఘ ఫార్మాట్‌లో కూడా జట్టుకు విజయాలు అందించగలడని ఈమేరకు శనివారం బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. కాగా దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ అనంతరం టీమిండియా టెస్ట్ కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ (Virat Kohli) రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. బీసీసీఐ తాజా నిర్ణయంతో మూడు ఫార్మాట్లకు రోహితే టీమిండియాకు నాయకత్వం వహించనున్నాడు.
పుజారా, రహానే లకు ఉద్వాసన..
ప్రస్తుతం స్వదేశంలో విండీస్‌తో మ్యాచ్‌లు ఆడుతోన్న టీమిండియా త్వరలోనే శ్రీలంకతో పోరుకు సిద్ధమవుతోంది. సొంతగడ్డపైనే మూడు టీ20 మ్యాచ్‌లు, రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. కాగా శ్రీలంకతో సిరీస్ కోసం రేసు గుర్రం జస్‌ప్రీత్ బుమ్రాను వైస్‌కెప్టెన్‌గా నియమించింది బీసీసీఐ. అదేవిధంగా ఫాం కోల్పోయి ఇబ్బందులు పడుతోన్న సీనియర్ బ్యాటర్లు ఛెతెశ్వర్ పూజారా, అజింక్యా రహానేలను జట్టు నుంచి తప్పించారు. అదేవిధంగా టీ20 మ్యాచుల నుంచి కింగ్ కోహ్లీ, రిషభ్ పంత్‌లకు విశ్రాంతి కల్పించారు. కాగా ఫిబ్రవరి 24న లక్నో వేదికగా టీ 20 మ్యాచ్‌తో శ్రీలంక టూర్ ప్రారంభమవుతోంది. ఆతర్వాత ధర్మశాల వేదికగా రెండు, మూడు టీ 20 మ్యాచ్‌లు జరుగుతాయి. అక్కడి నుంచి రెండు జట్లు మొహాలీకి వెళ్తాయి. మొదటి టెస్ట్ మ్యాచ్ (మార్చి 3–7) అక్కడే జరగనుండగా, రెండో డే నైట్ టెస్ట్ మ్యాచ్ (మార్చి12–16) బెంగళూరు వేదికగా జరగనుంది.
శ్రీలంకతో టీ-20 మ్యాచ్‌లకు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహర్, దీపక్ హుడా, రవీంద్ర జడేజా, యుజువేంద్రా చాహల్, కుల్ దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ఆవేశ్ ఖాన్
టెస్ట్ సిరీస్‌కు టీమిండియా..
రోహిత్ శర్మ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పంచల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టైన్), మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, సౌరభ్ కుమార్
Also Read:Crime News: వివాహితపై యువకుడి అత్యాచార ప్రయత్నం.. ప్రతిఘటించడంతో దారుణ హత్య..
Anasuya: వయసు దాచుకోవాల్సిన అవసరం లేదు.. అసలు ఏజ్ ఎంతో చెప్పేసిన అందాల అనసూయ..