Ipl 2022 Auction: సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌కు కొత్త అసిస్టెంట్‌ కోచ్‌.. సైమన్‌ కటిచ్‌ స్థానంలో ఎవరు రానున్నారంటే..

మరికొన్ని రోజుల్లో ఐపీఎల్‌-2022 సీజన్‌ ప్రారంభం కానుంది. అయితే ఈ పొట్టి సమరానికి ముందే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు అసిస్టెంట్‌ కోచ్‌ బాధ్యతల నుంచి తప్పుకుని ఫ్రాంఛైజీకి షాక్‌ ఇచ్చాడు సైమన్‌ కటిచ్‌

Ipl 2022 Auction: సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌కు కొత్త అసిస్టెంట్‌ కోచ్‌.. సైమన్‌ కటిచ్‌ స్థానంలో ఎవరు రానున్నారంటే..
Sunrisers Hyderabad
Follow us
Basha Shek

|

Updated on: Feb 19, 2022 | 8:41 PM

మరికొన్ని రోజుల్లో ఐపీఎల్‌-2022 సీజన్‌ ప్రారంభం కానుంది. అయితే ఈ పొట్టి సమరానికి ముందే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు అసిస్టెంట్‌ కోచ్‌ బాధ్యతల నుంచి తప్పుకుని ఫ్రాంఛైజీకి షాక్‌ ఇచ్చాడు సైమన్‌ కటిచ్‌ (Simon Katich). బెంగళూరు వేదికగా సాగిన ఐపీఎల్‌ మెగా వేలం (Ipl 2022 Auction)లో హైదరాబాద్‌ ఫ్రాంఛైజీ అనుసరించిన వ్యూహాలు నచ్చకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆటగాళ్ల ఎంపిక, కొనుగోలు విషయంలో యాజమాన్యంతో విభేదాలు తలెత్తడంతో సన్‌రైజర్స్‌ను వీడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కటిచ్‌ స్థానంలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు సైమన్ హెల్మోట్‌ (Simon Helmot) ను సన్‌రైజర్స్‌ అసిస్టెంట్‌ కోచ్‌గా సన్‌ రైజర్స్‌ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 2012 నుంచి 2019 వరకు సన్‌రైజర్స్‌ కోచింగ్‌ స్టాఫ్‌లో సైమన్ హెల్మోట్‌ భాగమై ఉన్నాడు. అదే విధంగా బిగ్‌ బాష్‌ లీగ్‌లో మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్ జట్టుకు కోచ్‌గా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించాడు.

కాగా ఐపీఎల్‌-2022లో సన్‌రైజర్స్‌ హెడ్‌ కోచ్‌గా టామ్‌ మూడీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే బౌలింగ్‌ కోచ్‌గా దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్‌ డేల్‌ స్టెయిన్‌, స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా ముత్తయ్య మురళీధరన్‌, ఫీల్డింగ్‌ కోచ్‌, స్కౌట్‌గా హేమంగ్‌ బదాని జట్టుకు సేవలందించనున్నారు. ఇప్పుడు ఎస్‌ఆర్‌హెచ్‌ అసిస్టెంట్‌ కోచ్‌గా ఈ బృందంతో కలిసి పనిచేయనున్నారు సైమన్ హెల్మోట్‌. కాగా ఐపీఎల్ 2021లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పూర్తిగా తేలిపోయిన సంగతి తెలిసిందే. లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడి.. కేవలం మూడింట మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఇక యూఏఈలో జరిగిన రెండో దశ మ్యాచుల్లో పూర్తిగా చేతులెత్తేసింది. కెప్టెన్‌గా డేవిడ్‌ వార్నర్‌ను తొలగించడం, తుది జట్టులో కూడా చోటుకల్పించకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తాజాగా ఐపీఎల్‌ వేలంలోనూ ఆటగాళ్ల ఎంపికపై సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ జరుగుతోంది.

Also Read:Sharwanand: భీమ్లానాయక్‌కు దారిచ్చిన శర్వానంద్‌.. ఆడవాళ్లు మీకు జోహార్లు విడుదల వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే..

Delhi : కేజ్రీవాల్‌పై సంచలన ఆరోపణలు చేసిన ఆప్‌ మాజీ నేతకు వై కేటగిరీ భద్రత.. కేంద్ర హోం శాఖ నిర్ణయం..

Tirumala: శ్రీవారి క్షేత్రంలో ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల తొలగింపు.. టీటీడీ నిర్ణయంపై వ్యాపారుల అసంతృప్తి.. భవిష్యత్‌ కార్యాచరణపై దృష్టి..