AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sharwanand: భీమ్లానాయక్‌కు దారిచ్చిన శర్వానంద్‌.. ఆడవాళ్లు మీకు జోహార్లు విడుదల వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే..

Aadavallu Meeku Johaarlu : ఎన్నో ఆశలు పెట్టుకున్న'మహా సముద్రం' సినిమా శర్వానంద్‌ (Sharwanand)కు మిశ్రమ ఫలితాన్ని ఇచ్చింది.

Sharwanand: భీమ్లానాయక్‌కు దారిచ్చిన శర్వానంద్‌.. ఆడవాళ్లు మీకు జోహార్లు విడుదల వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే..
Aadavallu Meeku Joharlu
Basha Shek
|

Updated on: Feb 19, 2022 | 8:05 PM

Share

Aadavallu Meeku Johaarlu : ఎన్నో ఆశలు పెట్టుకున్న’మహా సముద్రం’ సినిమా శర్వానంద్‌ (Sharwanand)కు మిశ్రమ ఫలితాన్ని ఇచ్చింది. దీంతో మళ్లీ తనకు ఇష్టమైన జోనర్‌లోనే సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యాడీ యంగ్‌ హీరో. ఇందులో భాగంగా శర్వా నటిస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. కిషోర్ తిరుమల (Kishore Tirumala) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ ర‌ష్మిక మంద‌న్న (Rashmika Mandanna) హీరోయిన్‌ గా నటిస్తుంది. టైటిల్‌ తోనే పాజిటివ్‌ వైబ్స్‌ క్రియేట్‌ చేసిన ఈ మూవీలో రాధికా శరత్ కుమార్‌, ఊర్వశి, ఖుష్బూ, వెన్నెల కిశోర్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆ తర్వాత వచ్చిన పోస్టర్లు, టీజర్లతో సినిమాపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌ పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తోన్న ఈ ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌ టైనర్‌ను మొదట ఫిబ్రవరి 25న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావించారు. అయితే అదే రోజు పవన్‌ కల్యాణ్‌ ‘భీమ్లానాయక్‌’ పెద్ద ఎత్తున థియేటర్లలో విడుదల కానుండడం తదితర కారణాలతో ఈ సినిమా విడుదల వాయిదా వేసింది. మార్చి 4న ఈసినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు దర్శక నిర్మాతలు స్పష్టం చేశారు.

క్లీన్‌ యూ సర్టిఫికెట్‌..

ఈ సందర్భంగా తమ చిత్రానికి సంబంధించి కొత్త పోస్టర్‌ ను కూడా విడుదల చేసింది చిత్రబృందం. ‘ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు ముగిశాయి. సెన్సార్ నుంచి ఈ చిత్రానికి క్లీన్ ‘యు’ సర్టిపికేట్ లభించినట్లుగా తాజాగా నిర్మాతలు అధికారికంగా పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ కలర్‌ఫుల్‌గా ఉంది. పెళ్లికొడుకు అవతారంలో ఉన్న శర్వానంద్.. రష్మిక మందన్నతో పాటు కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ వంటి వారందరికీ కూర్చొని నమస్కారం చేస్తున్నాడు. మంచి కథతో తెరకెక్కిన కుటుంబ కథా చిత్రమిది. టైటిల్‌కు తగ్గట్లుగానే ఈ సినిమాలో మహిళలకు ఎంతో ప్రాధాన్యముంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. మార్చి 4న ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమాను విడుదల చేయనున్నాం ‘ అని చిత్రబృందం తెలిపింది. కాగా ఈ మూవీకి రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

Also Read:Delhi : కేజ్రీవాల్‌పై సంచలన ఆరోపణలు చేసిన ఆప్‌ మాజీ నేతకు వై కేటగిరీ భద్రత.. కేంద్ర హోం శాఖ నిర్ణయం..

Tirumala: శ్రీవారి క్షేత్రంలో ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల తొలగింపు.. టీటీడీ నిర్ణయంపై వ్యాపారుల అసంతృప్తి.. భవిష్యత్‌ కార్యాచరణపై దృష్టి..

Rohit Sharma: టీమిండియా టెస్ట్‌ కెప్టెన్‌గా హిట్‌ మ్యాన్‌.. బీసీసీఐ అధికారిక ప్రకటన.. వైస్‌ కెప్టెన్‌ ఎవరో తెలుసా?