Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

H3N2 virus: నిజంగానే హెచ్‌3ఎన్‌2 ప్రాణాలను తీసేంత డేంజరా.? వైద్యులు చెబుతున్న ఆసక్తికర విశేషాలు.

దేశంలో హెచ్‌3ఎన్‌2 వైరస్‌ భయాలు మొదలయ్యాయి. మొదట్లో సాధారణ జ్వరం, జలుబు అనుకున్న ఈ వైరస్‌ ఇప్పుడు ప్రాణాంతకం అనగానే ఒక్కసారిగా ఉలిక్కిపడే పరిస్థితులు వచ్చాయి. దేశ వ్యాప్తంగా వైరస్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం రోజు హర్యానా, కర్ణాటకలో రెండు మరణాలు..

H3N2 virus: నిజంగానే హెచ్‌3ఎన్‌2 ప్రాణాలను తీసేంత డేంజరా.? వైద్యులు చెబుతున్న ఆసక్తికర విశేషాలు.
Virus
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 10, 2023 | 3:13 PM

దేశంలో హెచ్‌3ఎన్‌2 వైరస్‌ భయాలు మొదలయ్యాయి. మొదట్లో సాధారణ జ్వరం, జలుబు అనుకున్న ఈ వైరస్‌ ఇప్పుడు ప్రాణాంతకం అనగానే ఒక్కసారిగా ఉలిక్కిపడే పరిస్థితులు వచ్చాయి. దేశ వ్యాప్తంగా వైరస్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం రోజు హర్యానా, కర్ణాటకలో రెండు మరణాలు సంభవించాయి. దీంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది. ఇదిలా ఉంటే దేశంలో ఇప్పటి వరకు మొత్తం 90 వైరస్‌ కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే ఈ రెండు మరణాలు వైరస్‌ కారణంగానే జరిగాయా అన్నదానిపై ఐసీఎమ్‌ఆర్‌ ఎపిడెమియాలజీ, కమ్యూనికేబుల్‌ డీసీజెస్‌ హెడ్‌ డాక్టర్‌ సమీరన్‌ పాండా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

టీవీ9కి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లడుతూ.. హెచ్‌3ఎన్2 వైరస్‌ కారణంగా సంభవించిన మరణాలపై పూర్తి స్థాయిలో పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపారు. వైరస్‌ కారణంగానే రెండు మరణాలు జరిగినప్పటికీ.. వ్యక్తుల ఇతర అనారోగ్యాలను సైతం పరిగణలోకి తీసుకోవాలని సమీరన్‌ పాండా అన్నారు. ఇతర అనారోగ్య పరిస్థితులు కూడా మరణాలకు కారణమవుతాయని డాక్టర్‌ అభిప్రాయపడ్డారు. మనుషుల్లో అంతర్లీనంగా ఉన్న కొన్ని రకాల అనారోగ్య పరిస్థితులు కూడా మరణానికి కారణం కావొచ్చని ఆయన అన్నారు. హెచ్‌3ఎన్‌2 అనేది ఒక రకమైన ఇన్‌ఫ్లూయేంజా వైరస్‌ ఇప్పటికిప్పుడే పుట్టుకొచ్చింది కాదు. ఇది ఒక రకమైన ఫ్లూ అని పాండా తెలిపారు.

ఇదిలా ఉంటే.. ఇన్‌ఫ్లూయెంజాను మొత్తం మూడు రకాలుగుఆ వర్గీకరించారు. H1N1, H3N2, ఇన్‌ఫ్లూయెంజా బీ, భారత్‌లో ఇప్పటివరకు H1N1, H3N2 వైరస్‌లను మాత్రమే గుర్తించారు. హర్యానాలో కేసులు వేగంగా పెరుగుతున్నాయని, రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో ఫ్లూతో బాధపడుతున్న రోగులలో 40% పెరుగుదల నమోదైందని నివేదిక పేర్కొంది. పరిస్థితి విషమించకుండా సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసింది. ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా హెచ్3ఎన్2 వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఇన్‌ఫ్లుఎంజా ఎ సబ్‌టైప్ హెచ్3ఎన్2 వల్ల ఈ లక్షణాలు కనిపిస్తున్నాయని ఐసీఎంఆర్ నిపుణులు సూచిస్తున్నారు. గత రెండు, మూడు నెలలుగా హెచ్‌3ఎన్‌2 విస్తృతంగా చలామణిలో ఉందని, ఇతర వైరస్‌ల కంటే ప్రాణాంతకం అని వైద్య విభాగం తెలిపింది. హెచ్1ఎన్1తో పోల్చితే హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయేంజా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని డాక్టర్ డాంగ్స్ ల్యాబ్ సీఈఓ డాక్టర్ అర్జున్ డాంగ్ తెలిపారు.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..