Health Insurance: హెచ్ఐవీ/ఎయిడ్స్ కూడా కవర్ అయ్యేలా ఆరోగ్య బీమా పథకం.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

ఇస్యూరెన్స్ రెగ్యూలేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏఐ) ఈ వ్యాధులకు బీమా కవర్ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. మానసిక ఆరోగ్య సమస్యలు, హెచ్ఐవీ/ఎయిడ్స్, వైకల్యాలను బీమా క్లైమ్ చేసుకునేలా ఆదేశాలిచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవి..

Health Insurance: హెచ్ఐవీ/ఎయిడ్స్ కూడా కవర్ అయ్యేలా ఆరోగ్య బీమా పథకం.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
Health Insurance
Follow us

|

Updated on: Mar 10, 2023 | 3:46 PM

ఆరోగ్య బీమా ప్రస్తుత పరిస్థితుల్లో అనివార్యమవుతోంది. ముఖ్యంగా కరోనా సంక్షోభం తర్వాత అందరూ హెల్త్ ఇస్యూరెన్స్ తీసుకోడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే బీమా తీసుకొనే ముందు ఆ పాలసీలో ఎటువంటి వ్యాధులు కవరవుతున్నాయి? అన్ని వ్యాధులకు కవరేజీ ఉందా? వంటి అనేక అంశాలు సరిచూసుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని దీర్ఘకాలిక వ్యాధులకు ఇప్పటి వరకూ ఎటువంటి బీమా పాలసీలు లేవు. వాటిల్లో మానసిక రుగ్మతలు, హెచ్ఐవీ, ఎయిడ్స్, కొన్ని వైకల్యాలకు ఏ పాలసీలు వర్తించవు. అయితే ఇస్యూరెన్స్ రెగ్యూలేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏఐ) ఈ వ్యాధులకు బీమా కవర్ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. మానసిక ఆరోగ్య సమస్యలు, హెచ్ఐవీ/ఎయిడ్స్, వైకల్యాలను బీమా క్లైమ్ చేసుకునేలా ఆదేశాలిచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవి..

చట్ట ప్రకారం..

మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం 2017ని మే 2018 నుంచి అమలు చేస్తున్నారు. దీని ప్రకారం ఐఆర్డీఏఐ ఇన్యూరెన్స్ కంపెనీలకు పలు సూచనలు చేసింది. హెల్త్ ఇన్యూరెన్స్ స్కీమ్ లలో ప్రీ ఎగ్జిస్టింగ్ వ్యాధుల జాబితాలో మానసిక ఆరోగ్య సమస్యలు, హెచ్ఐవీ/ఎయిడ్స్, వైకల్యాలను జత చేయాలని ఆదేశించింది. బీమా తీసుకునే సమయంలో ఈ వ్యాధుల చరిత్రను తెలిపిన వినియోగదారులకు ఎట్టి పరిస్థితుల్లో క్లయిమ్ లు తిరస్కరించకూడదని వివరించింది. దీంతో ఇది కూడా ఆరోగ్య సంజీవని, కరోనా కవచ్, సరల్ పెన్షన్ వంటి పథకాల సరసన చేరే అవకాశం ఉంది. దీనిని అమలు చేసేందుకు బీమా కంపెనీలు కసరత్తు ప్రారంభించాయి. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాయి. ప్రస్తుతానికి దీనికి పేరు పెట్టలేదు. మోడల్ ప్రాడక్ట్ గా దీనికి కొన్ని నియమనిబంధనలను ఐఆర్డీఏఐ విధించింది.

బీమా ప్రీమియం పెరుగుతుంది..

ఒకవేళ ఈ వ్యాధులను కవర్ చేసేలా బీమా పాలసీని తయారు చేస్తే.. అప్పు బీమా ప్రీమియం పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే వెయిటింగ్ పీరియడ్ కూడా అధికంగానే ఉంటుందని వివరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

బీమా కవర్ ఎంత?

ఈ బీమా కవర్ రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకూ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల లోపు వారు దీనిని తీసుకోవచ్చు. అలాగే 17 ఏళ్ల లోపు మైనర్లకు కూడా దీనిని తీసుకోవచ్చు. దివ్యాంగులు 40 శాతం వైకల్యం ఉన్నట్లు గవర్నమెంట్ నుంచి ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. డిజబిలిటీ యాక్ట్ 2016 ప్రకారం 20 రకాల వైకల్యాలను పాలసీ పత్రంపై ముద్రిస్తారు. ఇదే బీమా పాలసీలో హెచ్ఐవీ/ఎయిడ్స్ రోగులకు కూడా కవర్ అందుతుంది. అయితే వీరికి 48 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అలాగే మొత్తం హాస్పటల్ బిల్ లో 20 శాతం రోగి చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తానికి బీమా కవర్ అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..