Gold Loan: గోల్డ్ లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? తక్కువ వడ్డీకి అందించే 10 బ్యాంకులు
ఇతర బ్యాంకు రుణాల కంటే తక్కువ వడ్డీని వసూలు చేస్తున్నందున ఇప్పుడు గోల్డ్ లోన్ తీసుకోవడం చౌకగా మారింది. ఇతర రుణాల కంటే గోల్డ్ లోన్ మెరుగైనది..
ఇతర బ్యాంకు రుణాల కంటే తక్కువ వడ్డీని వసూలు చేస్తున్నందున ఇప్పుడు గోల్డ్ లోన్ తీసుకోవడం చౌకగా మారింది. ఇతర రుణాల కంటే గోల్డ్ లోన్ మెరుగైనది. అలాగే మీ ఆభరణాలు కూడా భద్రంగా ఉంటాయి. అత్యవసర సమయాల్లో బంగారంపై రుణం తీసుకోవడం మరింత సులభంగా ఉంటుంది.
బంగారం పరిమాణం, స్వచ్ఛత ఆధారంగా బ్యాంకులు మీకు రుణం ఇస్తాయి. బ్యాంకు నుంచి ఈ రకమైన రుణాన్ని తీసుకోవడం చాలా సులభమైన, తక్కువ డాక్యుమెంటేషన్ ప్రక్రియ. తక్కువ వడ్డీతో పాటు, సర్దుబాటు చేయగల పదవీకాలం కూడా దీనిపై అందించడం జరుగుతుంది. మీరు బంగారంపై రుణం తీసుకోబోతున్నట్లయితే, తక్కువ వడ్డీని అందించే 10 బ్యాంకుల గురించి తెలుసుకోండి.
- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వడ్డీని 7.20 శాతం నుంచి 11.35 శాతం వరకు, ప్రాసెసింగ్ ఫీజు 1 శాతం వరకు అందిస్తుంది.
- కోటక్ మహీంద్రా బ్యాంక్ గోల్డ్ లోన్‌పై 8% నుంచి 17% వరకు వడ్డీ ఉంటుంది. దానిపై 2% ప్రాసెసింగ్ ఫీజు GSTతో ఉంటుంది.
- యూనియన్ బ్యాంక్ 8.40 శాతం నుండి 9.65 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తోంది.
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.45% నుంచి 8.55% వరకు వడ్డీని కలిగి ఉంది. రుణ మొత్తంలో 0.5% ప్రాసెసింగ్ ఛార్జీని కలిగి ఉంది.
- యూకో బ్యాంక్ 8.50 శాతం వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజు 250 నుంచి 5000 రూపాయల వరకు ఉంటుంది.
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ లోన్‌పై వడ్డీ 8.55%, ప్రాసెసింగ్ 0.50% + GST ఉంటుంది.
- ఇండస్‌ఇండ్ బ్యాంక్ గోల్డ్ లోన్‌పై 8.75% నుంచి 16% వరకు వడ్డీని వసూలు చేస్తుంది. ప్రాసెసింగ్ ఛార్జీ 1% శాతం.
- పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వడ్డీ 8.85 శాతం, ప్రాసెసింగ్ ఛార్జీ రూ. 500 నుంచి రూ. 10,000 వరకు ఉంటుంది.
- ఫెడరల్ బ్యాంక్ వడ్డీ 8.89 శాతం.
- పంజాబ్ నేషనల్ బ్యాంక్ 9 శాతం వడ్డీ, 0.75 శాతం ప్రాసెసింగ్ ఛార్జీని వసూలు చేస్తోంది.
గోల్డ్ లోన్ ఎంతకాలం తీసుకోవచ్చు?
ఈ రకమైన రుణాన్ని తిరిగి చెల్లించే వ్యవధి కస్టమర్ మరియు బ్యాంకుపై ఆధారపడి ఉంటుంది. అయితే గోల్డ్ లోన్ ధర బంగారం స్వచ్ఛతపై ఆధారపడి ఉంటుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, బంగారంపై రుణం కనీసం రూ. 20,000 నుండి గరిష్టంగా రూ. 1,50,00,000 వరకు పొందవచ్చు. 25 లక్షలకు పైబడిన మొత్తానికి ఐటీఆర్ అవసరం. మరోవైపు, 5 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయానికి పాన్ కార్డ్ అవసరం. మీకు పాన్ కార్డ్ లేకపోతే బంగారు రుణం పొందడం కష్టం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి