SBI Recruitment: రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగులకు బంపర్ ఆఫర్… 868 బ్యాంక్ ఆఫీసర్ల పోస్టుల భర్తీ.. ఇక వారికి పండగే..
అర్హులైన అభ్యర్థులు మార్చి 31 లోపు ఎస్భీఐ కేరీర్స్ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. దాదాపు 868 పోస్టులను ఈ తాజా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని ఎస్‌బీఐ నిర్ణయించింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఒప్పంద ప్రాతిపదికన ఎస్‌బీఐ, ఈఏబీ, ఇతర పీఎస్‌బీల్లో రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ల ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు మార్చి 31 లోపు ఎస్భీఐ కేరీర్స్ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. దాదాపు 868 పోస్టులను ఈ తాజా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని ఎస్‌బీఐ నిర్ణయించింది. అభ్యర్థులు దిగువ నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉన్న అర్హత ప్రమాణాలు, వయోపరిమితి, విద్యార్హత మరియు ఇతర వివరాలను తనిఖీ చేయవచ్చు.
అర్హతలు, ఖాళీల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
దరఖాస్తు చేయడానికి దశలివే..
- ఎస్‌బీఐ కెరీర్స్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- హోమ్‌పేజీలో, ఎస్‌బీఐ, ఈఏబీలు, ఇతర పీఎస్‌బీల కాంట్రాక్ట్ బేసిస్‌కి సంబంధించిన రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ ఎంగేజ్‌మెంట్‌పై క్లిక్ చేయాలి.
- అప్లై ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
- ఫామ్‌ను ఫిల్ చేసి, డాక్యుమెంట్స్‌ను అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ అవుట్ తీసుకుని జాగ్రత్త చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ
దరఖాస్తుదారులను షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ రౌండ్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.