Ministry of Railway Recruitment 2023: పరీక్షలేకుండా రైల్వేలో జాబ్.. నెలకు రూ. 1,42,400 వరకూ జీతం.. పూర్తి వివరాలు ఇవి..
రైల్వే మంత్రిత్వ శాఖ డిప్యూటేషన్ ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రోగ్రామర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
రైల్వే మంత్రిత్వ శాఖ డిప్యూటేషన్ ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రోగ్రామర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రైల్వే మంత్రిత్వ శాఖ ఎంపికైన అభ్యర్థులకు భారీగా వేతనం అందిస్తుంది. మూడేళ్ల ట్రాన్స్ఫర్ ఆన్ డెప్యూటేషన్ ప్రాతిపదికన ఈ ఎంపికలు ఉంటాయి. ఒక వేళ మీరు ఏదైనా కేంద్ర ప్రభుత్వ లేదా రాష్ట్ర ప్రభుత్వ లేదా యూనివర్సిటీల్లో ఇప్పటికే ఉద్యోగులైతే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎవరు అర్హులు..
మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్‌మెంట్ 2023 అధికారిక నోటిఫికేషన్ ప్రకారం అసిస్టెంట్ ప్రోగ్రామర్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ అర్హతలు కలిగి ఉండాలి.
- అభ్యర్థికి వయసు 56 ఏళ్లకు మించకూడదు.
- కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వా/కేంద్ర పాలిత ప్రాంతాలు/విశ్వవిద్యాలయాలు/గుర్తింపు పొందిన పరిశోధనా సంస్థ/ప్రభుత్వ రంగ సంస్థలు/సెమీ ప్రభుత్వం/చట్టబద్ధమైన/స్వయంప్రతిపత్తి గల సంస్థల్లో పనిచేస్తున్న అధికారులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- అలాగే పేరెంట్ కేడర్/డిపార్ట్‌మెంట్‌లో రెగ్యులర్ ప్రాతిపదికన పనిచేస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- అదే విధంగా పే మ్యాట్రిక్స్ (రూ.35400-112400)లో లెవెల్-6లో ఐదు సంవత్సరాల సర్వీస్ లేదా తత్సమానం, పేరెంట్ కేడర్ లేదా డిపార్ట్‌మెంట్‌లో రెగ్యులర్ ప్రాతిపదికన అపాయింట్‌మెంట్ అయిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్న వారు, అలాగే గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి BE/ B.Tech (కంప్యూటర్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ టెక్నాలజీ లేదా లేదా కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
వేతనం ఇలా.. ఎంపికైన అభ్యర్థికి రూ. 44,900 నుండి 1,42,400 వరకు నెలవారీ వేతనం ఇస్తారు. పోస్టింగ్ న్యూఢిల్లీలో ఉంటుంది.
అర్హతలు, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో ఇవ్వబడిన దరఖాస్తు పూర్తి చేసి డిప్యూటీ సెక్రటరీ, రూమ్ నంబర్ 110-C రైల్ భవన్ రైసినా రోడ్, న్యూఢిల్లీ-110001కి పంపవలసి ఉంటుంది. ఏప్రిల్ 24వ తేదీలోపు ఈ చిరునామకు సంబంధిత డాక్యూమెంట్లతో పంపవలసి ఉంటుంది.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.