CPCB Jobs: నెలకు రూ.1,77,500ల జీతంతో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు.. టెన్త్/ఇంటర్ అర్హత..
న్యూఢిల్లీలోని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ)..163 సైంటిస్ట్ బీ, అసిస్టెంట్ లా ఆఫీసర్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నికల్ సూపర్‌వైజర్, అసిస్టెంట్, అకౌంట్స్ అసిస్టెంట్ తదితర..
న్యూఢిల్లీలోని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ)..163 సైంటిస్ట్ బీ, అసిస్టెంట్ లా ఆఫీసర్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నికల్ సూపర్‌వైజర్, అసిస్టెంట్, అకౌంట్స్ అసిస్టెంట్, సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆయా పోస్టును బట్టి పదో తరగతి/ఇంటర్మీడియట్/డిప్లొమా/బ్యాచిలర్స్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు మార్చి 31, 2023వ తేదీ లోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో ప్రతి ఒక్కరూ రూ.1000లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్/ ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.18,000ల నుంచి రూ.1,77,500ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.